Raj Kundra అశ్లీల దందాలో అదే టార్గెట్.. భయంకర విషయాలను బయటపెట్టిన పోలీసులు!
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో తవ్విన కొద్ది భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ సినిమాల నిర్మాణం విషయంలో రాజ్ కుంద్రా పక్కా ప్లాన్‌తోనే ముందుకు వెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన విషయాలు విస్తుపోయేలా చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తొలి చార్జిషీట్ దాఖలు తర్వాత
రాజ్ కుంద్రా తన యాప్స్ ద్వారా అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేసి కోట్లు గడించాలని ప్లాన్ చేశారనే ఆరోపణలపై ఈ కేసులో తొలి చార్జ్ షీట్ నమోదు చేశారు. రాజ్ కుంద్రా ఆదాయం, ఆయన ప్లాన్స్‌ను ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో వెల్లడించారు బాలీ ఫేమ్ మీడియాలో రానున్న రోజుల్లో ఎలాంటి లక్ష్యాలను సాధించాలనే ఆ ప్రజెంటేషన్‌లో విషయాలను వెల్లడించారు.

146 కోట్ల లక్ష్యంగా
రాజ్ కుంద్రా అశ్లీల దందా ద్వారా 2023-24 వరకు రూ.146 కోట్ల రూపాయల గ్రాస్ రెవెన్యూను ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకొన్నారు. మొత్తంగా ఏటా 34 కోట్లు లాభాలను రాబట్టాలని ప్లాన్ చేసుకొన్నారు. అలాగే రానున్న సంవత్సరానికి మరింత రెట్టింపు చేయాలని భావించారు అని ముంబై పోలీసులు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టార్గెట్
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాజ్ కుంద్రా బాలీ ఫేమ్ యాప్ ద్వారా ఆదాయం 36.50 కోట్ల గ్రాస్ ఆదాయాన్ని, నికరంగా 5 కోట్లు రాబట్టేలా అంచనా వేశారు 2028-23 సంవత్సరానికి ఆ మొత్తాన్ని 73 కోట్ల గ్రాస్ రెవెన్యూగా మార్చాలని ప్లాన్ వేశారు అనే విషయాలను తాజా చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఫోరెన్సిక్ నిపుణల చేత అనాలిసిస్
రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత జూలై 20 తేదీన ఆయన ఆఫీస్ నుంచి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నాం. కంప్యూటర్ హార్డ్ డిస్కులను సీజ్ చేశాం. వాటి ద్వారా విషయాలను వెలికి తీస్తున్నాం. ఫొరెన్సిక్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం. హాట్ షాట్స్ యాప్ నుంచి చాలా కంటెంట్ బాలీ ఫేమ్ యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు అని అధికారులు మీడియాకు వెల్లడించారు.
Recommended Video

త్వరలోనే మరో చార్జిషీట్
రాజ్ కుంద్రాను పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ తర్వాత సోమవారం ఆయనను 14 రోజుల కస్టడికి తరలించారు. ముంబై ఆర్థర్ రోడ్‌లోని జైలులో ఆయనను ఉంచారు. బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా దానిని తిరస్కరించారు. ఈ కేసులో త్వరలోనే సప్లిమెంట్ చార్జిషీట్ దాఖలు చేయనున్నారు అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











