Bollywood Porn Rocket..రాజ్ కుంద్రాకు షాక్.. కోట్ల రూపాయల బ్యాంక్ అకౌంట్లు సీజ్

బాలీవుడ్ పోర్న్ రాకెట్ కేసులో పలువురి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తూ ముంబై పోలీసులు కొరడా ఝుళిపించారు. లోతైన విచారణ చేస్తున్న పోలీసులు పలు విషయాలను బహిర్గతం చేస్తున్నారు. లండన్‌‌లోని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ దందా చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించారు. ఇంటర్నేషనల్ పోర్న్ ఫిలిం రాకెట్ వెనుక రాజ్ కుంద్రా బావ మరిది ప్రదీప్ భక్షి కీలక సూత్రధారుడు అని పోలీసులు ఆరోపించారు.

యూకే, ఇండియాలో బూతు సినిమాలను నిర్మించి యాప్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు. హాట్‌షాట్స్ అనే యాప్ ద్వారా ఈ దందాను నిర్వహిస్తున్నారు అని పేర్కొన్నారు. ముంబైలో పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను క్రియేట్ చేసి హాట్ షాట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు అని తెలిపారు.

Raj Kundra Porn Rocket: Mumbai Police Siezes Crores from Bank accounts

రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆఫీస్‌లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో కొన్ని వీడియో క్లిప్పులు లభించాయి. ఫిర్యాదుల తర్వాత గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్స్ యాప్‌ కార్యకలాపాలు నిలిపివేశారు అని పోలీసులు తెలిపారు.

ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసుతో సంబంధం ఉన్న నిందితుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశాం. దాదాపు అకౌంట్లలో రూ.7.31 కోట్ల మేర డబ్బు ఉందని చెప్పారు. సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను మీడియాకు రిలీజ్ చేశారు.

Raj Kundra Porn Rocket: Mumbai Police Siezes Crores from Bank accounts

అరవింద్ కుమార్ శ్రీవాస్తవ అకౌంట్ నుంచి రూ.1.81 కోట్లు, హాట్‌హిట్ యాప్ నుంచి 34.90 లక్షలు, దీపాంకర్ అకౌంట్ నుంచి 1 లక్ష 20 వేలు, నటి గెహ్నా విశిష్ట అకౌంట్ నుంచి 37 లక్షలు, ఇతర అకౌంట్ల నుంచి స్వాధీనం చేసుకొన్నట్టు తెలిపారు.

జూలై 19వ తేదీన అరెస్ట్ చేసిన రాజ్ కుద్రాను జూలై 23 తేదీ వరకు పోలీస్ రిమాండ్‌కు తరలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X