For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Porn Rocket Case: రాజ్ కుంద్రా ప్లా బీ అదే.. బూతు చిత్రాలతో వాళ్లే టార్గెట్.. వాట్సాప్ ఛాట్ లీక్‌తో సంచలనం

  |

  దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పోర్నోగ్రఫి కంటెంట్ క్రియేషన్ బిజినెస్ విషయంలో వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పక్కా ప్లాన్‌తోనే ముందుకెళ్లాడనే విషయం పలు విషయాలతో స్పష్టమవుతున్నది. తాజాగా పోలీసులకు, మీడియాకు లభ్యమైన వాట్సప్ ఛాటింగ్‌లో రాజ్ కుంద్రా ముందస్తు ప్లాన్స్ వెలుగులోకి వచ్చాయి. హాట్ స్పాట్ యాప్‌ను గూగూల్ మూసివేసే పరిస్థితుల్లో అనుసరించాల్సిన విషయాలను వాట్సాప్ ఛాట్‌లో షేర్ చేసుకొన్నారు. వాటాప్స్ చాట్ విషయంలోకి వెళితే..

  Narappa Success meet: వెంకటేష్, ప్రియమణి, అనిల్ రావిపూడి హంగామా.. ఇంకా ఎవరెవరూ వచ్చారంటే!

  అశ్లీల కంటెంట్‌తో

  అశ్లీల కంటెంట్‌తో

  అశ్లీల కంటెంట్‌తో సినిమాలను నిర్మించే వ్యవహారంలో రాజ్ కుంద్రాతో పనిచేసే సిబ్బంది, బిజినెస్ పార్ట్‌నర్స్ అందరూ కలిసి H Account అనే పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లోనే పోర్న్ చిత్రాల గురించి చర్చించుకొనే వారు. అలాగే భవిష్యత్ ప్రణాళికలను ఒకరికొకరు చర్చించుకొనే వారు అనే విషయం బయటకు వచ్చింది.

  Priyamani లేటు వయసులో ఘాటు ఫొటోలతో ప్రియమణి.. ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు

  గూగుల్ ప్లే స్టోర్ షాక్

  గూగుల్ ప్లే స్టోర్ షాక్

  రాజ్ కుంద్రా తొలుత హాట్ షాట్స్ అనే యాప్ ద్వారా అశ్లీల చిత్రాలను అందిస్తూ ఉండేవారు. అయితే హాట్ షాట్స్ అనే యాప్‌ను తొలగిస్తూ గూగుల్ ప్లే స్టోర్ నిర్ణయం తీసుకోవడంతో బిజినెస్ పార్ట్‌నర్లు ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. హాట్ షాట్స్ తొలగించిన నేపథ్యంలో మరో 3 వారాల్లో కొత్త యాప్‌ను తయారు చేసి మరో ఛానెల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేసినట్టు వాట్సాప్ ఛాట్‌లో బయటపడింది.

  బాలీ ఫేమ్ యాప్‌పై వ్యతిరేకత

  బాలీ ఫేమ్ యాప్‌పై వ్యతిరేకత

  అయితే షాట్ షాట్ కాకుండా మరో యాప్‌ను తయారు చేయాలన్న ప్రతిపాదనను తన వ్యాపార భాగస్వామి రాబ్ డిజిటల్ మార్కెటింగ్ సభ్యులు వ్యతిరేకించారట. కొత్త యాప్‌ను తయారు చేయడానికి బదులుగా హాట్ షాట్స్‌లో ఉండే అన్ని బోల్డ్ చిత్రాలను డిలీట్ చేసి.. మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌ను రివ్యూ చేయమని అడుగుదాం. ఆ తర్వాత గూగుల్ ప్లే సానుకూలంగా స్పందిస్తే.. హాట్ షాట్స్ యాప్‌ను కొనసాగిద్దాం అని సూచించినట్టు వాట్సప్ ఛాట్‌లో వెలుగు చూసింది.

  Vadinamma : దమయంతికి షాక్.. సీక్రెట్ గా కలుసుకున్న శిల్ప-నాని, ఇక అంతేనా!

  రాజ్ కుంద్రా మొండిగా

  రాజ్ కుంద్రా మొండిగా

  హాట్ షాట్స్ యాప్‌ను కొనసాగించేలా చర్యలు తీసుకొందాం. బాలీ ఫేమ్ యాప్‌ ప్రతిపాదనను మానుకోవాలని రాబ్ డిజిటల్ మార్కెటింగ్ సభ్యులు రాజ్ కుంద్రాకు సూచించిన విషయం వాట్సాప్ ఛాట్‌లో స్పష్టమైంది. అయితే హాట్ షాట్స్‌ను క్లోజ్ చేసేందుకే రాజ్ కుంద్రా మొండిగా మొగ్గు చూపారు. ఆ క్రమంలోనే బాలీ ఫేమ్ యాప్ కోసం లోగో, ఇతర విషయాలను కూడా ఫైనల్ చేశారు.

  యూకే చట్టాలకు అనుగుణంగా

  యూకే చట్టాలకు అనుగుణంగా

  అయితే బాలీ ఫేమ్ యాప్‌ను రూపొందించే సమయంలో భారీ ప్రణాళికను రూపొందించారు. భారతీయ చట్టాలకు లోబడకుండా యూకే చట్టాలకు అనుగుణంగా బాలీ ఫేమ్ యాప్‌ బిజినెస్‌ను ప్లాన్ చేశారు. బాలీ ఫేమ్‌ను రూపొందించే బాధ్యతను ప్రదీప్ బక్షికి అప్పగించారు. రాజ్ కుంద్రా చేసిన ప్లాన్ బీలో భాగంగానే ఇదంతా జరిగింది అని వాట్సప్ ఛాటింగ్‌లో వెల్లడైంది.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  చిన్న పిల్లలే టార్గెట్‌గా రాజ్ కుంద్రా ప్లాన్ బీ

  చిన్న పిల్లలే టార్గెట్‌గా రాజ్ కుంద్రా ప్లాన్ బీ

  రాజ్ కుంద్రా H Account గ్రూప్‌లో లీకైన విషయాలు పోలీసులను దిగ్బ్రాంతికి గురిచేశాయి. యూకే చట్టాలకు అనుగుణంగా రూపొందించిన బాలీఫేమ్‌లో 7, 12, 16, 18 ఏళ్లకు పైబడిన వారికి కంటెంట్ అందించడానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో థ్యాంక్స గాడ్.. బాలీ ఫేమ్‌ను రూపొందించినందుకు అంటూ ప్రదీప్ బక్షిని అభినందించారు. ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రా, ర్యాన్ థోర్పే‌ను జూలై 19 తేదీన అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది.

  English summary
  International Porn Rocket case is taking twitst and turns. Raj Kundra's H accound whatsapp group reveals Plan B strategy In Porn Rocket case
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X