Raj Kundra Hot HIt యాప్‌లో పోర్న్ దందా.. రోజుకు ఆదాయం ఎంతంటే.. షాకిస్తున్న చీకటి వ్యాపారం!
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ దందాలోని చీకటి కోణాలన్నీ ఒక్కొక్కొటిగా వెలుగు చూస్తున్నాయి. మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల చిత్రాలను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ రిమాండ్‌కు తరలించడం తెలిసిందే. అయితే రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను నిర్మించి రోజుకు ఎంత సంపాదించారనే విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఏడాది ఆరంభంలోనే
రాజ్ కుంద్రా హాట్ హిట్ అనే యాప్‌తో పోర్న్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. ముంబై కేంద్రంగా చేసుకొని నిర్మిస్తున్న అశ్లీల చిత్రాలను ఆ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే హిట్ హాట్ యాప్ దందా విషయం మా దృష్టికి వచ్చింది. ఆ యాప్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు జమ అవుతున్నాయి అని ముంబై పోలీసులు తెలిపారు.

గూగుల్ ప్లే స్టోర్‌లో
గూగుల్ ప్లే స్టోర్‌లో హిట్ హాట్ యాప్‌ను రిజిస్టర్ చేసినప్పుడు.. బెస్ట్ ఇండియన్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అనే కాన్సెప్ట్‌ను చెప్పి నమోదు చేసుకొన్నారు. ప్లే స్టోర్‌లో సర్చ్ చేస్తే హిట్ హిట్ మూవీస్, ఒరిజినల్స్ అని కనిపిస్తుంది. ఆ యాప్‌లో చిత్రాలను చూడాలంటే సబ్‌స్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా పేమేంట్ గేట్‌వేను క్రియేట్ చేశారు అని పోలీసులు వెల్లడించారు.

నీలి చిత్రాలను చూడాలంటే...
హాట్ హిట్ యాప్‌లో ప్రీమియమ్ అకౌంట్‌లో చిత్రాలు చూడాలంటే.. 28 రోజులకు రూ.199, ఫుల్ హెచ్‌డీ లేదా సినిమాటిక్ వెర్షన్‌లో చూడాలంటే 45 రోజులకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఇండియన్ బెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ చూపిస్తాం అని యూజర్లకు సమాచారం అందిస్తారనే విషయం ఉంటుంది అని పోలీసులు పేర్కొన్నారు.

నెలలో రోజు వారీ సంపాదన
రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత వెల్లడైన ఆయన సంపాదన వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి నెలలో 3వ తేదీన అత్యధికంగా రూ.2.7 లక్షలు, జనవరి 10న 3 లక్షలు, జనవరి 13వ తేదీన 2 లక్షలు, జవనరి 20న రూ.1 లక్ష, జనవరిలో 25వ తేదీన 95 వేలు, అకౌంట్‌లో జమ అయినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. సగటున రోజు వారీ ఆదాయం రూ.లక్షకుపైనే ఉంటుందని నిర్ధారించారు.
Recommended Video


బ్యాంక్ అకౌంట్ల సీజ్
ఇలాంటి వార్తల నేపథ్యంలో రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కుంద్రాతో పనిచేసే భాగస్వాముల బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికే సీజ్ చేశారు. కోట్లాది రూపాయలను ముంబై పోలీసులు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని ప్రశ్నిస్తూ ఈ దందాలో చీకటి కోణాలను వెలికి తీస్తున్నారు.


Click it and Unblock the Notifications











