twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raj Kundra పై తీవ్రమైన ఆరోపణలు.. కేసు రుజువైతే ఎన్ని సంవత్సరాల శిక్ష అంటే!

    |

    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో దేశంలో పోర్నోగ్రఫి విషయంపై సరికొత్త చర్చకు దారి తీసింది. నిషేధిత పోర్నోగ్రఫికి సంబంధించిన చట్టాలు ఏమిటి? వాటికి సంబంధించిన కేసుల్లో కూరుకుపోతే శిక్షలు ఏమిటనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సినిమాలు, ఛాయచిత్రాలు, పుస్తకాల ద్వారా అశ్లీలతను ప్రచారం చేసినా.. ప్రమోట్ చేసినా చట్ట రీత్య శిక్షకు అర్హులు అనేది చట్టాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అశ్లీలతపై భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే...

    పోర్నోగ్రఫిని కంట్రోల్ చేసేందుకు

    పోర్నోగ్రఫిని కంట్రోల్ చేసేందుకు

    సినిమాల్లో, సీరియల్స్‌లో, సోషల్ మీడియాలో పోర్నోగ్రఫిని నియంత్రించేందుకు పలు చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఇండీసెంట్ రిప్రజంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ అండ్ యంగ్ పర్సన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, అలాగే ఐటీ యాక్ట్ 2000ను అమలు చేస్తున్నారు.

    రాజ్ కుంద్రాపై పెట్టిన కేసులు

    రాజ్ కుంద్రాపై పెట్టిన కేసులు

    ప్రస్తుతం అశ్లీల చిత్రాలను షూట్ చేసి సోషల్ మీడియా యాప్‌ల్లో ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను పలు చట్టాల కింద అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్, 34, 292, 293 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

    పోర్నోగ్రఫి కేసులో శిక్షలు ఇలా

    పోర్నోగ్రఫి కేసులో శిక్షలు ఇలా

    ఐటీ యాక్ట్, 2000కు వ్యతిరేకంగా, నిషేధిత ప్రోర్నోగ్రఫిని ప్రమోట్ చేసినా గానీ, అలాంటి కంటెంట్ అప్‌లోడ్ చేసినా... డౌన్ లోడ్ చేసుకిన్నా గానీ చట్ట రీత్యా శిక్షార్హులు. ఐటీ యాక్ట్ 2000ను ఉల్లంఘింస్తే సెక్షన్ 67 ప్రాకరం.. మూడేళ్ల జైలు గానీ, లేదా ఐదు లక్షల జరిమానా లేదా ఈ రెండింటిని విధించడానికి అవకాశం ఉంది.

     పోర్న్ వెబ్‌సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం

    పోర్న్ వెబ్‌సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం

    ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 900 లకుపైగా పోర్న్ వెబ్‌సైట్లను భారత ప్రభుత్వం నిషేధించింది. టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఇలాంటి పోర్న్ సైట్లను కట్టడి చేస్తున్నది. చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలను తీసుకొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం, కేసు తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం చర్చనీయాంశమైంది.

    రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు

    రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు

    రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు మోడల్స్, సినీ తారలు ఆయనపై కంప్లైయింట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఒకవేళ ఆ కేసులు నిరూపించడం జరిగితే కఠిన శిక్షను రాజ్ కుంద్రా అనుభవించాల్సి వస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

    English summary
    Raj Kundra arrested by Maharasthra Cyber Cell in pornographic content creation case in Mumbai. Apart from his arrest, Sherlyn Chopra, Poonam Pandey and Ekta Kapoor names surfaced but, NO arrest were made in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X