For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra Deals : 121 పోర్న్ వీడియోలు కోట్లల్లో.. వెలుగులోకి సంచలన డీల్స్!

  |

  పోర్న్ కంటెంట్ కేసులో చిక్కుకున్న రాజ్ కుంద్రాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ కేసులో ఒకదాని తర్వాత ఒకటి కొత్త విషయాలు వెల్లడి అవుతున్నాయి. ఇప్పుడు రాజ్ కుంద్రా యొక్క వాట్సాప్ చాట్స్ నుండి పెద్ద విషయం బహిర్గతం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

  Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
  ఇంటికి తీసుకెళ్ళి

  ఇంటికి తీసుకెళ్ళి

  సోమవారం రాత్రి 11 గంటలకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో విచారణ తరువాత, క్రైమ్ బ్రాంచ్ మూడు రోజుల తర్వాత రాజ్ ను తన ఇంటికి తీసుకు వెళ్ళింది. ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్ కుంద్రా ఇంటికి చేరుకుంది. ఇల్లు మొత్తం 6 గంటలు శోధించగా, రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టిని కూడా ముఖాముఖి విచారించారు.

  శిల్ప రాజీనామా

  శిల్ప రాజీనామా

  ఇక శిల్పా శెట్టి కొంతకాలం క్రితం రాజ్ కుంద్రా సంస్థ 'వియాన్ ఇండస్ట్రీస్' కు రాజీనామా చేశారు. ఇదే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మరియు ఈ విషయంలో శిల్పా శెట్టి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబడింది. అయితే, శిల్పా తన భర్తను సమర్థించి, రాజ్ నిర్మిస్తున్న సినిమాలు పోర్న్ కాదు, ఎరోటికా అని అన్నారు.

  పెద్ద డీల్

  పెద్ద డీల్

  ఇక ఆ సంగతి పక్కన పెడితే రాజ్ కుంద్రా పెద్ద ఒప్పందం చేసుకోబోతున్నట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. అతను 121 పోర్న్ (121 పోర్న్ వీడియోస్ డీల్) చిత్రాలను 1.2 మిలియన్లకు, అంటే 8.93 కోట్ల రూపాయలకు విక్రయించబోతున్నాడని గుర్తించారు. ఈ ఒప్పందానికి అన్ని సన్నాహాలు కూడా జరిగాయి. శుక్రవారం కోర్టులో విచారణ సందర్భంగా ముంబై పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

  Raj Kundra పోర్న్ వ్యవహారం మీద నోరు విప్పిన శిల్ప.., అంతా ఆయనే చేశాడు, నాకు సంబంధం లేదు!

  ఆ డబ్బు ఇలా

  ఆ డబ్బు ఇలా

  ఇక పోర్న్ చిత్రాల ద్వారా వచ్చే ఆదాయంతో రాజ్ కుంద్రా ఆన్‌లైన్ బెట్టింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. రాజ్ కుంద్రా పోలీసు రిమాండ్‌ను జూలై 27 వరకు కోర్టు పొడిగించింది. ఇక వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం, కోర్టులో విచారణ సందర్భంగా, పోలీసులు, రాజ్ కుంద్రా వాట్సాప్ చాట్ పరిశీలిస్తున్న సమయంలో ఈ ఒప్పందం బయటకొచ్చిందని పేర్కొన్నారు.

  ముందే జాగ్రత్తపడి

  ముందే జాగ్రత్తపడి

  వాట్సాప్ గ్రూపులోనే, రాజ్ కుంద్రా, ర్యాన్ థార్ప్, ఆనంద్ బక్షి మరియు ఇతర సహచరులు హాట్‌షాట్స్ యాప్‌లోని కంటెంట్ గురించి మాట్లాడుకునేవారని పోలీసులకు దర్యాప్తులో తెలిసింది. దీనితో పాటు, దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని, ఈమెయిల్స్ మరియు వెబ్‌సైట్ల నుండి చాలా సమాచారాన్ని ఆనంద్ బక్షి జూలైలోనే తొలగించారని గుర్తించారు. ఈ తొలగించిన డేటా హాట్‌షాట్‌ల యాప్‌కు లింక్ చేయబడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  50 లక్షలకి 14 కోట్లు.. సీక్వెల్ కి డైరెక్టర్ ని ప్రకటించిన మురగదాస్.. ఎవరంటే?

  ఉద్యోగులను విచారిస్తే

  ఉద్యోగులను విచారిస్తే

  ఇక పోలీసులు రాజ్ కుంద్రా యొక్క సంస్థ అనేక ఉద్యోగుల వాంగ్మూలాలను చేశారు. ఫిబ్రవరిలో పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత, ర్యాన్ థార్ప్ ఆదేశాల మేరకు హాట్‌షాట్స్ యాప్‌కు సంబంధించిన డేటాను తొలగించారని ఈ ఉద్యోగులు తెలిపారు. ఇది మాత్రమే కాదు, రాజ్ కుంద్రా యొక్క 'ప్లాన్ బి' అని ఆరోపించబడిన కొత్త యాప్ 'bollyfame' ను జనవరిలో ర్యాన్ థార్ప్ సృష్టించారని పోలీసులు పేర్కొన్నారు. వీడియోల్లో కనిపించిన నటీమణులను గుర్తించడం ద్వారా వారిని మరింత విచారించడానికి పోలీసులు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు.

  ఆరు గంటలు వెతికి

  ఆరు గంటలు వెతికి


  ఇక రాజ్-శిల్పాల ఇంట్లో 6 గంటల శోధన మరియు విచారణ తర్వాత క్రైమ్ బ్రాంచ్ బృందం ఆ ఇంటి నుండి ల్యాప్‌టాప్‌లు మరియు అనేక ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. అంతకుముందు రాజ్ కుంద్రా కార్యాలయంలో కూడా దాడులు జరిగాయి. 48 టిబి అశ్లీల వీడియో కంటెంట్ ఉన్న శాండ్‌బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వీటిలో 35 వీడియోలు హాట్‌షాట్‌ యాప్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి.

  English summary
  As per latest updates, Raj Kundra had apparently stuck a shocking deal for creating and delivering 121 adult videos. He demanded $1.2 million for delivering these videos. This roughly converts to Rs 8.3 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X