ఎంతో నమ్మి, ప్రేమించా.. కానీ ఇలా చేస్తుందనుకోలే.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన రాజ్ కుంద్రా సోదరి!
గత కొద్ది రోజులుగా శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అలాగే ఆయన మొదటి భార్య కవిత గురించి అనేక వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తున్నాయి. రాజ్ కుంద్రా దాదాపు 12 సంవత్సరాల తర్వాత మొదటి భార్య కవితతో విడిపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా తాజాగా రాజ్ కుంద్రా సోదరి తన మాజీ వదిన గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

ఇన్నాళ్ళ తరువాత
శిల్పా శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శిల్పా శెట్టికి మొదటి వివాహమే అయినా రాజ్ కుంద్రా అప్పటికే కవిత అనే మహిళను వివాహం చేసుకుని ఆమెకు విడాకులు సైతం ఇచ్చారు. అయితే శిల్పా శెట్టి వివాహం చేసుకున్న తర్వాత తన భర్త తాను విడిపోవడానికి కారణం శిల్పాశెట్టి అని అప్పట్లో రాజ్ కుంద్రా మొదటి భార్య సంచలన ఆరోపణలు చేశారు.

విడిపోవడానికి గల కారణం
అయితే ఈ విషయం మీద అప్పుడు ఏమి స్పందించని రాజ్ కుంద్రా తాజాగా కవితతో తాను విడిపోవడానికి గల కారణం ఆమె తన చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే అని రాజ్ కుంద్రా వెల్లడించారు. సోదరుడి లాంటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక తమను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు.

సోదరుడి లాంటి వ్యక్తితో అఫైర్
తమ వివాహమైన కొత్తలో తల్లిదండ్రులు, సోదరి సోదరి భర్తతో కలిసి తాను తన భార్య యునైటెడ్ కింగ్డమ్ లో నివాసం ఉండేవారమని ఆ సమయంలోనే తన భార్య చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసిందని అన్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సహా డ్రైవర్లు కూడా తనకు చెప్పేవారని ఆయన వెల్లడించారు.

ఆ మెసేజీలు అన్నీ చూసి
ఈ విషయం తెలియడంతో తన చెల్లెలిని ఆమె భర్తను ఇండియాకి పంపించేశామని అలా పంపాక కూడా తన భార్య ఒక సెల్ ఫోన్ అతని కోసమే సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ మెసేజ్ లు చేసేదని అని వెల్లడించారు. ఆ ఫోన్ కంట పడడంతో తాను ఆ మెసేజీలు అన్నీ చూసి తట్టుకోలేకపోయానని అందుకే ఆమెకు విడాకులు ఇచ్చాను అని చెప్పుకొచ్చారు.

గుండె బద్దలైనట్లు
తాజాగా ఈ అంశం మీద రాజ్ కుంద్రా సోదరి రీనా మాట్లాడుతూ కవితను తానొక మంచి సోదరిలాగా భావించానని తనను ఎంతో ప్రేమించి, ఎంతగానో నమ్మాను అని చెప్పుకొచ్చింది. ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.. అంత క్లోజ్ అయిన తనకు ఇలా మోసం చేయాలని ఆమెకు ఎలా అనిపించిందో తెలియదని ఆమె తన భర్తతో వివాహేతర సంబంధం నేర్పుతున్న విషయం తెలియగానే గుండె బద్దలైనట్లు అనిపించిందని రీనా చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











