పోర్నోగ్రఫీ కేసుల తరువాత రాజ్ కుంద్రా సంచలన నిర్ణయం.. శిల్పా శెట్టి పేరు మీద రూ.38కోట్ల ఆస్తి

గత ఏడాది సంచలనం సృష్టించిన కేసులలో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసు ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను నిర్మిస్తున్నారని బలవంతంగా కూడా కొంతమంది నటీనటులను అందులోకి లాగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక కొన్ని రోజుల పాటు కస్టడీలోనే ఉన్న రాజ్ కుంద్రా ఫైనల్ గా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఆయన ఇటీవల తన పేరు మీద ఉన్న కీలకమైన ఆస్తులను తన భార్య శిల్పా శెట్టి పేరు మీదకు మార్చినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఎందుకు అలా చేశారు అనే విషయం సోషల్ మీడియాలో లో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

 గత ఏడాది కష్టంగా..

గత ఏడాది కష్టంగా..

వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన తర్వాత గత సంవత్సరం చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. శిల్పా శెట్టి కూడా కొన్ని రోజుల పాటు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. గతంలో జరిగిన ఎన్నో వివాదాలను కూడా బాలీవుడ్ మీడియా బయటకు లాగడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ విషయంలో భర్త రాజ్ కుంద్రా కారణంగా శిల్పా శెట్టి మనోవేదనకు గురైనట్లు టాక్ వచ్చింది.

 చాలాకాలం తరువాత పార్టీలో..

చాలాకాలం తరువాత పార్టీలో..

కొంత కాలం పాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ తో తిరిగి వచ్చినప్పటి నుండి సైలెంట్ గానే ఉంటున్నాడు. వ్యాపారాలను కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. చాలా కాలం అనంతరం శిల్పా, రాజ్ ఇటీవల షమితా శెట్టి బర్త్ డేలో దర్శనమిచ్చారు. బాలీవుడ్ మీడియా కూడా వారిపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో వారి ఫొటోలు ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అయ్యాయి.

 భార్య పేరు మీదకు బదిలీ

భార్య పేరు మీదకు బదిలీ

ఇక ఇప్పుడు రాజ్ కుంద్రా ఆస్తికి సంబంధించిన విషయాలు మళ్ళీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒక బాలీవుడ్ వెబ్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం రాజ్ కుంద్రా తన ఫ్లాట్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జుహులో ఉన్న ఖరీదైన ప్లాట్ ను అతని భార్య శిల్పా శెట్టి పేరు మీద బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది.

 శిల్పా శెట్టికి 38.5 కోట్ల ఆస్తి..

శిల్పా శెట్టికి 38.5 కోట్ల ఆస్తి..

రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టికి 38.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాసిచ్చినట్లుగా తెలుస్తోంది. రాజ్ కుంద్రా ఐదు ఫ్లాట్‌లతో కూడిన భవనంలోని మొదటి అంతస్తు మొత్తాన్ని, అలాగే జుహు ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న వారి బంగ్లాను తన భార్య పేరుకు బదిలీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. 5,995 చదరపు అడుగుల ఇంటి బదిలీ డీడ్‌పై రూ. 1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు కూడా తెలుస్తోంది. ఆ పత్రాలు ఈ ఏడాది జనవరి 21 రిజిస్టర్ చేయబడినట్లు సమాచారం.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?

ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఒక్క చదరపు అడుగులకు రూ. 65,000గా ఉంటుందని అంటున్నారు దీంతో మొత్తంగా రాజ్ కుంద్రా 30కోట్లకు పైగా విలువైన ఆ భవన ఆస్తులను శిల్పా శెట్టికి అప్పగించినట్లు సమాచారం. అయితే హఠాత్తుగా రాజ్ కుంద్రా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే విషయంలో ఇంకా సరైన కారణం తెలియరాలేదు. మరి అలా ఎందుకు చేసి ఉంటారు అనే విషయం తెలియాలి అంటే వారే సమాధానం ఇవ్వాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X