Raj Kundra Arrest: కెమెరా ముందు సెక్స్ చేస్తే.. డబ్బులు ఇవ్వాలా? శిల్పాశెట్టి భర్త ట్వీట్లు వైరల్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. పోర్నోగ్రఫి కంటెంట్ క్రియేషన్ కేసులో ఆయనను ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ కేసులో రాజ్ కుంద్రాను కీలక నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కెన్రీన్ అనే యూకే కంపెనీకి లింకులు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. కెన్నీన్ కంపెనీలో రాజ్ కుంద్రా గతంలో పార్ట్‌నర్‌గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

2012 ట్వీట్లు వైరల్
రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆయనకు సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. గతంలో పోర్న్ వర్సెస్ ప్రాస్టిట్యూషన్ అనే అంశంపై చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. 2012లో ఆయన చేసిన ట్వీట్లను నెటిజన్లు రీ ట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

రెమ్యునరేషన్లు ఎందుకు ఇవ్వాలి
తన ట్వీట్లలో రాజ్ కుంద్రా.. పోర్న్ (అశ్లీలత), ప్రాస్టిట్యూషన్ (వ్యభిచారం) గురించి ప్రస్తావిస్తూ... కెమెరా ముందు శృంగారం చేసే వారికి ఎందుకు రెమ్యునరేషన్ చెల్లించాలి అంటూ ప్రశ్నించాడు. పోర్న్‌కు, ప్రాస్టిట్యూషన్‌కు సంబంధం లేదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అందరూ పోర్న్ చూస్తున్నారంటూ...
మరో ట్వీట్‌లో రాజ్ కుంద్రా.. ఇండియాలో యాక్టర్లు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెటర్లు పాలిటిక్స్ చేస్తున్నారు. పొలిటిషియన్లు పోర్న్ చూస్తున్నారు. పోర్న్ స్టార్స్ యాక్టర్లు అవుతున్నారు.. ఈ విషయాలు మీరే పరిశీలించండి అంటూ రాజ్ కుంద్రా పేర్కొన్నారు.

షెర్లీన్, పూనమ్ పాండేకు 30 లక్షలు
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండేను కూడా ఇటీవల విచారించారు. షెర్లీన్, పూనమ్ పాండేలకు రెమ్యునరేషన్ ఇచ్చి వారితో అడల్ట్ కంటెంట్ షూట్ చేశారు. షెర్లీన్‌కు ప్రతీ ప్రాజెక్టుకు 30 లక్షలు ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 20 ప్రాజెక్టులను షెర్లీన్ పూర్తి చేసింది అని ముంబై సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది.
Recommended Video

రాజ్ కుంద్రాపై కేసు ఇదే...
రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి.. ఐటీ యాక్ట్, ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (ప్రొబేషన్) చట్టాల కింద ఐపీసీ 292, 67, 67ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరినీ విచారిస్తున్నాం. ఈ కేసులో లోతైనా దర్యాప్తు చేస్తున్నాం అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ చెప్పారు.


Click it and Unblock the Notifications











