twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Porn Rocket case శిల్పాశెట్టికి ఎదురుదెబ్బ.. రాజ్ కుంద్రా పిటిషన్ కొట్టివేత.. అతడే కీలక కుట్రదారుడు అంటూ

    |

    ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు మరో దెబ్బ తగిలింది. ఈ కేసులో జూలై 19వ తేదీన అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా ప్రస్తుతం పోలీస్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. బుధవారం కోర్టులో జరిగిన వాదనలు ఏమిటంటే...

    అందరూ బెయిల్‌పై బయటే

    అందరూ బెయిల్‌పై బయటే

    పోర్న్ రాకెట్ కేసులో ఏప్రిల్‌లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. అధికారులు తమ దర్యాప్తు చేసిన తర్వాతనే పలువురని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాను కూడా విచారించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బెయిల్‌పై బయట ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా బెయిల్ మంజురూ చేయాలని కోర్టును రాజ్ కుంద్రా తరఫు న్యాయవాదులు కోరారు.

    Raj Kundra రెండు రోజుల పోలీసు రిమాండ్లో ఎలా ఉన్నాడో చూడండి!Raj Kundra రెండు రోజుల పోలీసు రిమాండ్లో ఎలా ఉన్నాడో చూడండి!

    బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు

    బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు

    అయితే ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపిస్తూ.. పోర్న్ స్కామ్‌లో రాజ్ కుంద్రా కీలక కుట్రదారుడు. సమాజంలో అత్యంత ప్రభావం, పరపతి ఉన్న ప్రముఖుడు, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. సాక్ష్యులను బెదిరించడానికి కూడా అవకాశం లేకపోలేదు. అలాగే డబ్బుతో సాక్ష్యులను కొనడానికి అవకాశం ఉంది అని కోర్టుకు తెలిపింది.

    Bigg Boss బ్యూటీ హిమజ హాట్ ఫోటోలు.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ పిక్స్!Bigg Boss బ్యూటీ హిమజ హాట్ ఫోటోలు.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ పిక్స్!

    రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరణ

    రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరణ

    దాంతో డిఫెన్స్ లాయర్లు, ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాత ముంబై కోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. రాజ్ కుంద్రాతోపాటు అతడి వ్యాపార భాగస్వామి ర్యాన్ థోర్ప్‌కు బెయిల్ నిరాకరించింది. దాంతో మరికొన్ని రోజులు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ వస్తుందని ఆశించిన శిల్పాశెట్టి కుటుంబం తీవ్ర నిరాశకు లోనైంది.

    రాజ్ కుంద్రా పిటిషన్‌పై

    రాజ్ కుంద్రా పిటిషన్‌పై

    ఇదిలా ఉండగా, తన అరెస్ట్ అక్రమం అంటూ రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే కోర్టు గురువారం వాదనలు విననున్నది. ఈ పిటిషన్‌కు సంబంధించి రాజ్ కుంద్రాకు ఉపశమనం కలిగించే విధంగా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అలాగే తన అరెస్ట్ చట్టరీత్య వ్యతిరేకం అంటూ సవాల్ చేసిన రాజ్ కుంద్రా పిటిషన్‌పై జూలై 29లోపు ముంబై పోలీసులు రెస్పాన్స్ పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ ఏఎస్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు.

    Recommended Video

    Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
    సీబీఐ కీలక వ్యాఖ్యలు

    సీబీఐ కీలక వ్యాఖ్యలు

    ఇక పోర్న్ రాకెట్ కేసులో విచారణఖు రాజ్ కుంద్రా సహకరించడం లేదని పోలీసు అధికారులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ విచారణకు సహకరించకపోతే ఆయనకు సంబంధించిన వియాన్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన సిబ్బంది సాక్ష్యులుగా మారుతారు అని సీబీఐ అధికారులు వెల్లడించారు. దాంతో రాజ్ కుంద్రాకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

    English summary
    Raj Kundra's Bail Plea rejected on key conspirator allegations. The prosecution is objecting to Kundra's bail. Lawyers inform the court that if he is granted bail, he could threaten the witnesses or lure them with money
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X