నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన స్త్రీ.. లాభాల పంపిణిలో సిగపట్లు
అందాల తార శ్రద్ధాకపూర్, విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం స్త్రీ సంచలన విజయ సాధించింది. ఆ చిత్రాన్ని రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే, దినేష్ విజన్ నిర్మించారు. రాజ్, డీకే కలిసి రూపొందించిన గో గోవా గాన్ సినిమాకు అస్టిస్టెంట్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. లాభాలను పంచుకోవడంలో నిర్మాతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయట. వివరాల్లోకి వెళితే...

అంతా మేమే చేశాం..
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. మేము అప్పటికే స్త్రీ సినిమా షూటింగ్ ప్రారంభించాం. మేం షూట్ చేస్తున్న సమయంలో దినేష్ మాతో కలిశాడు. ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్‌నర్‌గా ఉంటామని చెప్పాడు. దాంతో డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మించిన స్త్రీ సినిమాకు ఓ నిర్మాతగా దినేష్ మారాడు అని రాజ్, కృష్ణ డీకే వెల్లడించారు.

మాకు అన్యాయం చేస్తున్నారు
మేము స్త్రీ సినిమాకు సర్వం సేవలందించాం. మేకింగ్, కాస్టింగ్, సాంకేతిక నిపుణుల ఎంపిక, పోస్ట్ ప్రొడక్షన్, కథ, డైలాగ్స్ రాయడం వద్ద నుంచి రిలీజ్ వరకు అన్నీ పనులు మేమే చేశాం. లాభాల పంపిణీలో అన్యాయం చేస్తున్నారు అని రాజ్, కృష్ణ ఆవేదన వ్యక్తం చేసినట్టు కథనంలో పేర్కొన్నారు.

దినేష్ వాదన మరోరకంగా
కానీ స్త్రీ సినిమా విషయంలో దినేస్ తరఫు వారు మరో వాదన వినిపించినట్టు తెలుస్తున్నది. స్త్రీ కథ రాజ్, కృష్ణ రాసినప్పటికీ, మేం ఎక్కువగా ఒరిజినల్ కథ మాదే. దానిపై మేం పనిచేశాం. అందుకే లాభాల్లో మాకు వారికంటే ఎక్కువ వాటా రావాలని డిమాండ్ చేశాం అన్నట్టు మరో కథనం వెలువడింది.

రాజీ దిశగా చర్చలు
దినేష్ కథ ఒరిజినల్ అయినప్పటికీ రాజ్, డీకేకు రావాల్సిన లాభాలు ఆయన ఇవ్వడం లేదు. దాంతో వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఓ వ్యక్తి వెల్లడించారు. ఇరు వర్గాలను రాజీ చేసి లాభాలను పంచే విషయంలో చర్యలు తీసుకొంటున్నట్టు తెలిసింది.

ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు
రాజ్, కృష్ణ డీకే మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మేము కచ్చితంగా ఉన్నాం. మా మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. మా సంస్థ మాడాక్‌పై నిందలు వేయడం సరికాదు. ఈ విషయంలో ఒప్పంద నైతికతను పాటించడం లేదు అని నిర్మాత దినేష్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











