twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్ కేసులో మరో వికెట్.. రాజీవ్ మసంద్‌కు పోలీసుల ఝలక్!

    |

    బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. గత రెండు రోజులుగా దర్యాప్తులో వేగంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి. అమిత్ షా, ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసులు వెల్లడం, జాతీయ చానెళ్లలో సుశాంత్ సూసైడ్‌పై పెద్ద ఎత్తున్న చర్చ జరగడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా సినీ క్రిటిక్ రాజీవ్ మసంద్‌ను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

     రాజీవ్ మసంద్‌పై తీవ్ర ఆరోపణలు

    రాజీవ్ మసంద్‌పై తీవ్ర ఆరోపణలు

    సుశాంత్ సింగ్ సినిమాలను, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటూ సినీ జర్నలిస్టు, క్రిటిక్ రాజీవ్ మసంద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా కథనాలు సుశాంత్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఈ హీరో ఎవరో ఊహించండంటూ బ్లైండ్ స్టోరీలు రాశారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కంగన రనౌత్‌తోపాటు మనోజ్ బాజ్‌పేయ్, అపూర్వ అస్రానీ లాంటి ప్రముఖులు రాజీవ్ మసంద్‌ను ఘాటుగా విమర్శించారు. ఈ కేసు విచారణపై న్యాయవాది ఇష్కరన్ భండారీ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

     రాజీవ్ రాతలు దారుణం.. పిరికి పంద చర్య

    రాజీవ్ రాతలు దారుణం.. పిరికి పంద చర్య

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను టార్గెట్ చేస్తూ బ్లైండ్ ఐటెమ్స్ రాయడం దారుణం. పిరికిపంద చర్య. ఒకరిని సెలెక్టివ్‌గా టార్గెట్ చేయడం మానుకో అంటూ నటుడు, ఎడిటర్ అపూర్వ అస్రానీ ట్వీట్ చేశారు. అమాయకులైన ప్రతిభావంతులను అసభ్యకరమైన పదజాలంతో జర్నలిస్టులు టార్గెట్ చేయడం మానుకోవాలి. ఇలాంటి హిపోక్రాటిక్ చర్యలు సమర్ధనీయం కాదని మనోజ్ బాజ్‌పేయ్ అన్నారు.

    కంగన రనౌత్ ఫైర్ కావడంతో

    కంగన రనౌత్ ఫైర్ కావడంతో

    సుశాంత్‌ను డ్రగ్గిస్ట్, రేపిస్ట్, డైరెక్టర్లను కొడతారంటూ కథనాలు రాసిన రాజీవ్‌‌పై పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కంగన రనౌత్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడాతూ.. సుశాంత్‌ను డిప్రెషన్‌లోకి నెట్టిన రాజీవ్ మసంద్‌ను పోలీసులు ఎందుకు విచారించరు అంటూ ఫైర్ అయ్యారు. దాంతో కంగన ఆరోపణలు తీవ్రంగా మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్ మసంద్‌ను పోలీసులు విచారణకు ఆహ్వానించారు.

    బాంద్రా పీఎస్‌లో రాజీవ్ మసంద్

    బాంద్రా పీఎస్‌లో రాజీవ్ మసంద్

    మంగళవారం ఉదయం జూన్ 21వ తేదీన జర్నలిస్టు రాజీవ్ మసంద్ బాంద్రా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. మధ్నాహ్నం ఆయన బాంద్రా పోలీసు స్టేషన్‌కు రావడం మీడియా కంటపడింది. ప్రస్తుతం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. రాజీవ్ మసంద్ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది.

    మానసిక వైద్యుల విచారణ

    మానసిక వైద్యుల విచారణ

    గత కొద్ది రోజులుగా సుశాంత్‌కు డిప్రెషన్‌కు చికిత్స చేసిన వైద్య నిపుణులను ముంబై పోలీసులు ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. గత నాలుగు రోజులుగా మానసిక వైద్యులను ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్స్‌ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు అని అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
     ఇప్పటి వరకు 40 మంది విచారణ

    ఇప్పటి వరకు 40 మంది విచారణ

    జూన్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 40 మందిని సుశాంత్ సూసైడ్ కేసులో విచారించారు. దర్శకుడు ముఖేష్ చాబ్రా, సంజనా సంఘీ, ఆదిత్య చోప్రా, సందీప్ సింగ్, రియా చక్రవర్తి, యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధులను, సంజయ్ లీలా భన్సాలీ లాంటి ప్రముఖులను విచారించారు. ఈ కేసు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కొందరు ప్రముఖులు సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేయడం గమనార్హం.

    English summary
    Critic and Journalist Rajeev Masand has been summoned by Mumbai Police in Sushant Singh Rajput case. He was reached to Bandra Police station on July 21 afternoon. He Attended before Bandra Polices for statement record.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X