For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతడితో బ్రేకప్ ... స్టార్ హీరోయిన్ సోదరుడితో టీవీ నటి కోర్టు మ్యారేజ్!

|

బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ వివాహం టీవీ నటి చారు అసోపాతో జరిగింది. కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. తమ ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో వీరు తమ రిలేషన్ షిప్‌కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ హడావుడి మొదలు పెట్టారు. తాజాగా వివాహ బంధంతో ఏకమయ్యారు.

చారు అసోపా, రాజీవ్ సేన్ జూన్ 7, 2019న ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితులు మధ్య పెళ్లి చాలా సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. జూన్ 16వ తేదీన గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, టీవీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫోటోస్

సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫోటోస్

పెళ్లి ముగిసిన అనంతరం రాజీవ్ సేన్, చారు అసోపా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరూ ఇండియన్ ట్రెడిషనల్ సింపుల్ లుక్‌లో అందంగా మెరిసిపోయారు. నూతన దంపతులను విష్ చేస్తూ ఫ్యాన్స్ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

సుస్మితాసేన్

సుస్మితాసేన్

చారు అసోపా అనే నేను రాజీవ్ సేన్‌ను నా భర్తగా స్వీకరిస్తున్నాను... అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు. ‘రాజీవ్ సేన్ అనే నేను చారు అసోపాను నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను' అంటూ అతడు తన పేజీలో పోస్ట్ చేశాడు. అయితే పెళ్లి ఫోటోల్లో మాత్రం సుష్మితా సేన్ కనిపించలేదు. ఎంగేజ్మెంట్ తర్వాత వారితో కలిసి సుస్మితా సేన్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అతడితో బ్రేకప్ తర్వాత...

అతడితో బ్రేకప్ తర్వాత...

రాజీవ్ సేన్ కంటే ముందే.... చారు అసోపా ఎంగేజ్మెంట్ నటుడు నీరజ్ మాల్వియాతో జరిగింది. అయితే ఇది పెళ్లి వరకు వెళ్లకముందే ఇద్దరూ మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత మోడల్, ఎంట్రపెన్యూర్ అయిన రాజీవ్ సేన్‌తో ఆమె ప్రేమలో పడ్డారు.

రాజీవ్ రాకతో నా జీవితంలో కొత్త మలుపు

రాజీవ్ రాకతో నా జీవితంలో కొత్త మలుపు

నీరజ్ మాల్వియాతో తన బ్రేకప్ గురించి గతంలో చారు అసోపా మాట్లాడుతూ... ‘అతడితో బ్రేకప్ తర్వాత నా జీవితంలోలో ఎన్నో మార్పలు జరిగాయి. ప్రేమ గురించి ఆలోచించడం మానేశాను. అయితే రాజీవ్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలో నూతనోత్తేజం మొదలైంది. రాజీవ్ అందగాడు, నిజాయితీ పరుడు. మా ఇద్దరిలో అతడే చాలా రొమాంటిక్. నన్ను చాలా బాగా చూసుకుంటాడు' అని వ్యాఖ్యానించారు.

English summary
Sushmita Sen's brother Rajeev Sen has married television actress Charu Asopa. They tied the knot in a court marriage on Friday, June 7, 2019, in Mumbai. It is being said that there may be another traditional wedding happening, with a reception on June 16.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more