భారత దేశం గర్వించదగ్గ దర్శకుడు లైంగికంగా వేధించాడా.. ఆమెకు సెన్స్ లేదా!

గత ఏడాది మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేసింది. సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలైంది. తనుశ్రీ దత్తా ఇచ్చిన ధైర్యంతో చాలా మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపులని వివరిస్తూ పలువురు దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లు బయట పెట్టారు. మీటూ ఉద్యమ ప్రభావంతో చాలా మంది దర్శకులు, నటులు సినిమాలు కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికీ తరచుగా కొంతమంది మహిళలు బాలీవుడ్ లో లైగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇటీవల భారత దేశం గర్వించ దగ్గ దర్శకులలో ఒకరిగా భావించే రాజ్ కుమార్ హిరానీ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు.

 క్రేజీ చిత్రాలతో

క్రేజీ చిత్రాలతో

రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించే చిత్రాలన్నీ ఏదో ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ అందులోని లోపాలని ఎత్తిచూపే విధంగా ఉంటాయి. చాలా నెమ్మదిగా చిత్రాలు తీసినా తన దర్శత్వంతో రాజ్ కుమార్ హిరానీ ఆడియన్స్ ని ఫిదా చేస్తుంటారు. మున్నాభాయ్ ఎంబిబిఎస్ చిత్రంలో వైద్యరంగంలో ఉన్న లోపాలని సెటైరికల్ గా చూపించాడు. 3 ఇడియట్స్ చిత్రంలో విద్యారంగంపై, పీకే చిత్రంలో మూఢ నమ్మకాలపై సెటైర్లు వేశారు. రాజ్ కుమార్ తెరకెక్కించే ప్రతి చిత్రం ఆణిముత్యంలా ఉంటుంది. అందుకే ఆయన్ని భారత దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరని పలువురు ప్రశంసిస్తుంటారు.

అసిస్టెంట్ డైరెక్టర్

అసిస్టెంట్ డైరెక్టర్

ఇటీవల రాజ్ కుమార్ హిరానీ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఓ మహిళా దర్శకురాలు సంచలన ఆరోపణలు చేసింది. తనని రాజ్ కుమార్ సంజు చిత్ర షూటింగ్ సమయంలో లైగికంగా వేధించారని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కానీ రాజ్ కుమార్ స్టార్ డైరెక్టర్ కావడంతో ఆమె వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ మాట్లాడలేదు. తాజాగా రాజ్ కుమార్ పై వస్తున్న ఆరోపణలపై అతడి స్నేహితుడు, క్రేజీ హీరో సంజయ్ దత్ స్పందించారు.

ఏళ్ల తరబడి ట్రావెల్ చేశా

ఏళ్ల తరబడి ట్రావెల్ చేశా

రాజ్ కుమార్ పై వస్తున్న ఆరోపణలపై సంజయ్ దత్ స్పందిస్తూ.. నేను రాజ్ కుమార్ దర్శత్వంలో పలు చిత్రాల్లో నటించా. అంటే ఆయనతో ఏళ్ల తరబడి ట్రావెల్ చేశా. రాజ్ కుమార్ ఎలాంటి వ్యక్తో నాకు పూర్తిగా తెలుసు. అసలు ఈ ఆరోపణలని నేను నమ్మను అని సంజయ్ దత్ తెలిపారు. రాజ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ దత్ మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగేరహో మున్నాభాయ్, పీకే లాంటి చిత్రాల్లో నటించారు.

ఆమెకు సెన్స్ ఉందా

ఆమెకు సెన్స్ ఉందా

సంజయ్ దత్ మాట్లాడుతూ.. రాజ్ కుమార్ పై ఆరోపణలు చేసిన మహిళకు సెన్స్ ఉందా అని మండిపడ్డారు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలి. కానీ ఆమె అలాంటి చర్యలేవి తీసుకోవడం లేదు. దీనిని బట్టే అర్థం అవుతోంది సదరు మహిళ చేసిన కామెంట్స్ కేవలం పబ్లిసిటీ కోసమే అని సంజయ్ దత్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X