బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?
బాలీవుడ్‌కు పెళ్లి కళ వచ్చినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు జంటల పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాలో హంగామా చేస్తుంటే.. మరో పెళ్లి తెరపైకి వచ్చింది. హిందీ చిత్ర పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్‌గా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ రావు పెళ్లి జరిగినట్టు ముంబైలో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

హిందీ చిత్ర పరిశ్రమలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వార్త ఓ వైు, వికి కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వార్త మరోవైపు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే వీరిద్దరూ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండా నోరు విప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్‌కుమా్ రావు తన ప్రియురాలు పత్రలేఖను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తెరపైకి వచ్చింది. వీరి పెళ్లి నవంబర్ 10 నుంచి 12వ తేదీలోపు జరిగే అవకాశం ఉంది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పత్రికలను పంచారు అని కథనాలు వెలువడుతున్నాయి.
పత్రలేఖతో రాజ్‌కుమార్ అఫైర్ కొద్ది సంవత్సరాలుగా సాగుతున్నది. ఈ ఏడాది తన అఫైర్ గురించి ఎమోషనల్‌గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా.. అది వైరల్ అయింది. తన ప్రియురాలిపై ప్రశంసలు గుప్పిస్తూ.. అత్యంత అందమైన అమ్మాయి.. ఇంత వరకు అలాంటి అమ్మాయిని చూడలేదంటూ పోస్టు పెట్టగా దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.
రాజ్‌కుమార్ రావు కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన బదాయి హో సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో భూమి పడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన రిలీజ్ కానున్నది. ఈచిత్రంలో పోలీస్ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను హర్భవర్ధన్ కులకర్ణి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











