బాలీవుడ్‌కి ‘HIT’.. హిందీ రీమేక్‌లో ఆ యంగ్ హీరో
ఓ భాషలో ఆదరణ పొందిన చిత్రాలను మరో భాషలో తెరకెక్కించడం సర్వ సాధారణమే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు కథలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ రెండు ఇండస్ట్రీల్లోనూ వచ్చాయి. తాజాగా మరో తెలుగు సినిమా కథ.. బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. కొత్త దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన HIT సినిమా.. తెలుగు నాట సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటి సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన హిట్.. తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. విశ్వక్సేన్ నటన, శైలేష్ కొలను టేకింగ్.. అన్నీ కలిసి సినిమాను భారీ విజయాన్ని దక్కించాయి. నిర్మాత నానికి బాగానే గిట్టుబాటు అయింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ ప్రకటన వచ్చేసింది.

దిల్ రాజు నిర్మాతగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో శైలేష్ కొలను తెరకెక్కించబోతోన్నాడని ప్రకటించారు. యంగ్ హీరో రాజ్ కుమార్ రావు హీరోగా ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించనున్నాడని తెలిపారు. ఇప్పటికే జెర్సీ సినిమాతో బాలీవుడ్‌లో నిర్మాతగా మారిపోయిన దిల్ రాజు.. హిట్ ప్రాజెక్ట్‌ను కూడా రెడీ చేశాడు. కుల్దీప్ రాథోడ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారట. 2021లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications











