లో క్లాస్ గర్ల్ అంటావా? హీరోయిన్‌కు వార్నింగ్... 50 కోట్ల పరువు నష్టం తప్పదా?

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఇంతగా బలపడటానికి కారణం బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను తెరపైకి తెచ్చి నానా పాటేకర్ మీద ఆరోపణలు చేయడమే అని చెప్పక తప్పదు. తనుశ్రీ ఇన్సిడెంట్ తర్వాత ఇతరులు సైతం గతంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులు, హరాస్మెంట్ ఘటనలను బయట పెడుతూ ఉద్యమాన్ని తీవ్రం చేశారు.

పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలో నానా పాటేకర్‌తో వివాదం తర్వాత తనుశ్రీ ఐటం సాంగ్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానాన్ని రాఖీ సావంత్‌తో భర్తీ చేశారు. అయితే తాజాగా వివాదంలో నానా పాటేకర్‌కు మద్దతుగా రాఖీ సావంత్ నిలవడంతో పాటు... కేవలం ఫేమ్ కోసమే తనుశ్రీ పదేళ్ల క్రితం జరిగిన దానిపై ఇపుడు ఆరోపణలు చేస్తోందని మండిపడింది.

రాఖీ సావంత్ మీద రూ. 10 కోట్ల పరువు నష్టం దావా

రాఖీ సావంత్ మీద రూ. 10 కోట్ల పరువు నష్టం దావా

ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ మీద తనుశ్రీ దత్తా రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఓ టీవీ ఛానల్‌తో తనుశ్రీ లాయర్ మాట్లాడుతూ తన క్లయింట్ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడినందుకు రాఖీ మీద పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు.

రూ. 50 కోట్ల దావా వేస్తానంటూ రాఖీ సావంత్

అయితే తనుశ్రీ దత్తా తనపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేయడంపై రాఖీ సావంత్ స్పందించారు. తాను కూడా తనుశ్రీ దత్తా మీద రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నట్లు తెలిపారు. తనను లోక్లాస్ అంటూ తనుశ్రీ దత్తా నీచంగా మాట్లాడిందని, అందుకే రూ. 50 కోట్ల పరువునష్టం దావా వేయబోతున్నట్లు తెలిపారు.

ముందు రూ. 10 లక్షలు కోర్టులో కట్టు

ముందు రూ. 10 లక్షలు కోర్టులో కట్టు

తనపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన తనుశ్రీ దత్తా ముందు కోర్టులో రూ. 10 లక్షలు జమ చేయాలని, తాను రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నందు రూ. 50 లక్షలు కోర్టులో జమచేయబోతున్నట్లు రాఖీ తెలిపారు.

 బాలీవుడ్లో ఉధృతం అయిన మీటూ ఉద్యమం

బాలీవుడ్లో ఉధృతం అయిన మీటూ ఉద్యమం

తనుశ్రీ దత్తా ఇన్సిడెంట్ తర్వాత బాలీవుడ్లో మీటూ ఉద్యమం బలపడింది. వేధింపులకు గురైన పలువురు మహిళలు, నటీమణులు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు టాప్ డైరెక్టర్ సుభాష్ ఘాయ్, సాజిద్ ఖాన్, రజత్ కపూర్, వికాస్ బహల్, నటుడు అలోక్ నాథ్, మ్యూజీషియన్స్ అను మాలిక్, కైలాష్ ఖేర్ లాంటి పేర్లు బయట పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X