ఎన్ఆర్ఐతో రాఖీ సావంత్ పెళ్లి అంటూ రూమర్స్... అసలు నిజం ఇదే!
బాలీవుడ్ వివాదాస్పదన నటి, ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్ రాఖీ సావంత్ వివాహం ఒక ఎన్ఆర్ఐతో రహస్యంగా జరిగినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ముంబైలోని జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో ఆదివారం(జులై 28)న వీరి పెళ్లి జరిగినట్లు ఆ వార్తల సారాంశం.
కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో... హోటల్ గదిలో సింపుల్‌గా వీరి వివాహం జరిగినట్లు చర్చించుకుంటున్నారు. ఏ విషయంలో అయినా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉండే రాఖీ సావంత్ తన వివాహాన్ని ఎందుకు ఇలా ఎవరికీ తెలియకుండా చేసుకున్నారు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

అయితే ఈ న్యూస్ కాస్త రాఖీ సావంత్ వరకు వెళ్లడంతో ఆమె స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. బ్రైడల్ ఫోటో షూట్ కోసమే తాను ఇక్కడికి వచ్చానని, పెళ్లి లాంటిది ఇక్కడ ఏమీ జరుగలేదు అని స్పష్టం చేశారు.

'జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో బ్రైడల్ ఫోటో షూట్ కోసం వచ్చాను. నాకు పెళ్లి జరిగిందనే విషయం ఎలా ప్రచారంలోకి వచ్చిందో అర్థం కావడం లేదు. ఎవరో కావాలనే నాపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. నాకు పెళ్లి కాలేదు. నేను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. సింగిల్ గానే ఉన్నాను' అని రాఖీ సావంత్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











