రాఖీ సావంత్ మరో రచ్చ.. నాశనం చేస్తానని అంటున్నాడంటూ ఫిర్యాదు!
బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఆమె తన కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి వార్తల్లో ఉంది. అయితే తాజాగా రాఖీ వీడియో ఒకటి బయటకు వచ్చింది, అందులో ఆమె కెమెరా ముందు ఏడుస్తూ కనిపించింది. అసలు ఏమైంది రాఖీ ఎందుకు ఏడ్చింది? ఆమె మీడియా ముందుకు ఎందుకు వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే

సోషల్ మీడియా ఖాతాల హ్యాక్
రాఖీ సావంత్ తాజాగా మీడియా ముందు తన బాధను బయట పెడుతూ ఏడ్చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయని ఆమె ఆరోపించింది. తనకు డర్టీ మెసేజ్‌లు వస్తున్నాయని రాఖీ తెలిపింది. ఈ కారణంగా, రాఖీ సావంత్ తన కొత్త ప్రియుడు ఆదిల్ దుర్రానీతో కలిసి ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. రాఖీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేయబడిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాజీ భర్త రితేష్ తన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారని రాఖీ సావంత్ ఆరోపించింది.

తప్పుగా ప్రవర్తించాడు
రాఖీ సావంత్, మీడియా ముందు ఏడుస్తూ, రితేష్ నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని ఆరోపించింది. నిన్ను, ఆదిల్ ని నాశనం చేస్తాను అని బెదిరిస్తున్నాడు. నిన్ను, ఆదిల్‌ని కలిసి ఉండనివ్వనని భయపెడుతున్నాడని అన్నారు. ఇక రాఖీ సావంత్ రితేష్ గురించి మాట్లాడుతూ మూడేళ్లలో అతను నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు. నన్ను ఇంటి నుంచి గెంటేసేవాడు, దుర్భాషలాడేవాడు. ఇప్పుడు నా సోషల్ మీడియాపై దాడి చేస్తున్నాడని అన్నారు.

భరించలేక
నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలన్నీ హ్యాక్ చేసి ఈ పని చేశాడు. అతను నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? నేను అతనిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పటి వరకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అన్నారు. ఇక భరించలేక ఇప్పుడు పోలీసుల వద్దకు వచ్చాను. లోపల ఎలా ప్రశ్నిస్తారో తెలియదు. కానీ ముంబై పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.

ఆదిల్ దురానీతో డేటింగ్
రాఖీ సావంత్ ప్రస్తుతం దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆదిల్ దురానీతో డేటింగ్ చేస్తోంది. రాఖీ సావంత్ అంతకు ముందు కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా 2020 సంవత్సరంలో తన వివాహాన్ని ప్రకటించింధీ. ఆమె షేర్ చేసిన ఫోటోలలో రాఖీ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది. కానీ ఆమె భర్త ముఖం చూపబడలేదు. దీని తర్వాత రాఖీ తన భర్త రితేష్‌తో కలిసి 'బిగ్ బాస్ 15'కి చేరుకుంది.

పగ తీర్చుకునేందుకు
అయితే షో నుంచి బయటకు రాగానే ఇద్దరూ విడిపోయారు. బిగ్ బాస్ నుంచి నిష్క్రమించిన కొన్ని రోజుల తర్వాత రాఖీ మాజీ భర్త రితేష్ నుంచి విడిపోయారు. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వనందున తాను చట్టబద్ధంగా రితేష్ భార్య కాదని రాఖీ తెలిపింది. ఇప్పుడు రాఖీ సావంత్‌పై పగ తీర్చుకునేందుకు రితీష్ తన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశాడా.. రాఖీ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











