హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్.. మాజీ ప్రియుడి వార్నింగ్.. సెన్సేషనల్ ఇష్యూ
హీరోయిన్స్ అన్నాక డేటింగ్, ప్రేమ వ్యవహారాలు సాధారణమే అనుకుంటాం. కానీ ఒక్కోసారి అవే ఊహించని పరిణామాలకు దారితీస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ విషయంలో అదే జరిగింది. తీరా పెళ్లయ్యాక ఆమె మాజీ ప్రియుడు కళ్ళు చెదిరిపోయే డిమాండ్ ఆమె ముందుంచాడు. దీంతో ఈ ఇష్యూ సెన్సేషనల్‌గా మారింది. ఇంతకీ అసలు విషయమేంటి? పూర్తి వివరాల్లోకి పోతే..

సీక్రెట్ వివాహం.. ఆ తర్వాత క్లారిటీ
సెక్సీతార, బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను యూకేలో ఉన్న ఎన్నారై బిజినెస్ మెన్ రితీశ్ అనే యువకుడిని పెళ్లాడినట్లుగా రాఖీ సావంత్ వెల్లడించింది. కేవలం అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితుల నడుమ తమ వివాహ వేడుక జరిగిందని తెలిపింది.

ఇద్దరం అక్కడికే వెళ్ళిపోతాం
పెళ్లి కాగానే ఆయన యూకే వెళ్లిపోయాడని, తనకు కూడా వీసా వచ్చిన వెంటనే యూకే వెళ్లి అక్కడే స్థిరపడతాం అని చెప్పింది రాఖీ సావంత్. టీవీ షోలను నిర్మించాలనేది తన కల అని.. పెళ్లి తర్వాత అది నెరవేర బోతోందని ఆమె తెలిపింది. తనకు మంచి భర్తను ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు అని చెప్పింది రాఖీ.

ఇంతలో మాజీ ప్రియుడు ఎంట్రీ
నిజానికి దీపక్ అనే వ్యక్తితో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ ప్రకటించింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన్ను వివాహం చేసుకోవడం లేదని సోషల్‌మీడియాలో పేర్కొన్న రాఖీ.. ఇటీవలే రితీశ్ అనే ఎన్నారైను రహస్యంగా వివాహం చేసుకుని షాకిచ్చింది. దీంతో ఆమె సీక్రెట్ మ్యారేజ్ పై
తాజాగా మాజీ ప్రియుడు దీపక్ రియాక్ట్ అయ్యాడు.
తనకు 4 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
రాఖీ సావంత్ తనను మోసం చేసిందంటూ దీపక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ మేరకు తనకు 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నాలుగు రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. దీంతో ఈ ఇష్యూ కాస్త సెన్సేషన్‌గా మారింది.

దీపక్ పై ఎదురు దాడి.. రాఖీ సావంత్ రియాక్షన్
ఇదిలా ఉంటే మాజీ ప్రియుడు దీపక్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడింది రాఖీ సావంత్. దీపక్ కావాలనే తనపై తనను టార్గెట్ చేస్తున్నాడంటూ ఫైర్ అయింది. తన భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్నావని, నువ్వు నన్నేమీ చేయలేమంటూ దీపక్ పై ఎదురు దాడికి దిగింది రాఖీ సావంత్. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది రాఖీ.


Click it and Unblock the Notifications











