twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    31న రాఖీ సావంత్ పెళ్లి.. ముందే కన్యత్వ పరీక్ష.. అండర్‌వేర్‌కు తాళం చెవి..!

    |

    Recommended Video

    Rakhi Sawant Getting Married To Deepak Kalal

    వివాదాస్పద నటి రాఖీసావంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నది. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించే దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియాలో దీపక్ అత్యధికంగా ట్రోల్ కాబడిన వ్యక్తిగా పేరు తెచ్చుకొన్నారు. ఆయన పోస్ట్ చేసే వీడియోలు అత్యంత వివాదాస్పదంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ పెళ్లి వార్త బాలీవుడ్‌ వర్గాల్లో చర్చకు దారీ తీసింది. రాఖీ సావంత్ పెళ్లి వార్త పబ్లిసిటీ కోసమా? లేక నిజంగానే వివాహం చేసుకోబోతున్నారా అనే విషయంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

    ఇన్స్‌టాగ్రామ్‌లో వెడ్డింగ్ కార్డు

    ఇన్స్‌టాగ్రామ్‌లో వెడ్డింగ్ కార్డు

    మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్లి 2018 డిసెంబర్ 31న సాయంత్రం 5.55 గంటలకు అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులకు ఇదే ఆహ్వానం అంటూ తమ వెడ్డింగ్ కార్డును రాఖీ సావంత్, దీపక్ కలాల్ ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టారు.

     వైరల్‌గా మారిన వీడియో

    వైరల్‌గా మారిన వీడియో

    అంతకు ముందు రాఖీ సావంత్ గురించి చెబుతూ దీపక్ కలాల్ పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. రాఖీ సావంత్ తన అండర్‌వేర్‌కు తాళం వేసుకొన్నది. ఆ తాళం చెవి నా చేతికి అందింది అంటూ ఓ వీడియోలో దీపక్ చెప్పడం కనిపించింది. ఆ వీడియోలో రాఖీ సావంత్‌కు పెళ్లి ప్రతిపాదన చెప్పడం జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

    పెళ్లికి ముందు కన్యత్వ పరీక్ష

    పెళ్లికి ముందు కన్యత్వ పరీక్ష

    పెళ్లికి ముందు రాఖీ సావంత్, దీపక్ కలాల్ కన్యత్వ పరీక్షలు జరిపించుకొన్నారట. అదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. పెళ్లికి ముందు నేను, రాఖీ సావంత్ డాక్టర్ వద్దకు వెళ్లాం. డాక్టర్ వద్ద కన్యత్వ పరీక్షలు జరిపించుకోగా. మేమిద్దరం వర్జిన్స్‌గా (కన్యగా, బ్రహ్మాచారిగా) వైద్యుడు ధ్రువీకరించాడు. అది మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అని దీపక్ కలాల్ పేర్కొన్నాడు.

    గొడవలోకి వాళ్లను లాగొద్దు, కావాలంటే క్షమాపణలు చెబుతాను!గొడవలోకి వాళ్లను లాగొద్దు, కావాలంటే క్షమాపణలు చెబుతాను!

    వివాదాల్లో రాఖీ సావంత్

    వివాదాల్లో రాఖీ సావంత్

    రాఖీ సావంత్ విషయానికి వస్తే ఎప్పుడూ ఏదో వివాదంలో మునిగి తేలుతుంటుంది. ఈ మధ్యకాలంలో తనుశ్రీ దత్తా, నానాపాటేకర్ గొడవలో తలదూర్చింది. 12 ఏళ్ల క్రితం నాపై చాలాసార్లు లైంగిక దాడి చేసింది అని తనుశ్రీ దత్తాపై రాఖీ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత తనుశ్రీ దత్తా, రాఖీ సావంత్ మధ్య భారీగానే వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.

    ఇంటర్నెట్ సెన్సేషన్ దీపక్

    దీపక్ కలాల్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో గమ్మత్తైన ప్రసంగాలతో హల్‌చల్ చేస్తుంటాడు. ఎక్కువ ఆడవాళ్ల గొంతుతో మాట్లాడుతూ వినోదాత్మకంగా వీడియోలు పెడుతుంటాడు. కశ్మీర్‌పై దీపక్ పోస్ట్ చేసిన వీడియో వివాదంగా మారి ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.

    English summary
    Controversial actress Rakhi Sawant is said to be tying the knot with Internet sensation Deepak Kalal who is one of the most trolled personalities on social media. In another Instagram post, Deepak Kalal said that Rakhi Sawant had undergone virginity test before marriage and was glad the reports were found positive adding that he was also a virgin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X