Rakhi Sawant భర్త అరెస్ట్.. ముంబై పోలీసుల అదుపులో.. కారణం ఏమిటంటే?

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన తల్లి మరణించిన కొద్ది రోజుల తర్వాత భర్త నుంచి వేధింపులు గురి కావడం మరో విషాదంగా మారింది. ఇటీవల తన భర్త తనను వేధిస్తున్నాడు. తన తల్లి మరణానికి కారణం ఆయనే అంటూ రాఖీ సావంత్ ఆరోపించిన నేపథ్యంలో ఆదిల్ దురానీ అరెస్ట్ కావడం గమనార్హం. అయితే రాఖీ సావంత్ భర్త అరెస్ట్ వెనుక కారణాల్లోకి వెళితే..

భర్త ఆదిల్ దురానీతో రాఖీ సావంత్‌‌కు వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై ఆమె ఆరోపించారు. దాంతో విభేదాలు పెరిగిపోవడంతో.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నన్ను విపరీతంగా కొట్టారు. నా డబ్బు తీసుకెళ్లిపోయారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Rakhi Sawant husband Adil Durrani arrested by Mumbai Police

ఆదిల్ దురానీ అరెస్ట్ తర్వాత రాఖీ సావంత్ మాట్లాడుతూ.. నేను నా భర్తపై కంప్లయింట్ ఇచ్చాను. ఇది నేను ఆడుతున్న డ్రామా కాదు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను శారీరకంగా వేధించాడు. నా డబ్బును కూడా తీసుకెళ్లాడు అని చెప్పింది.

రాఖీ సావంత్ తల్లి జయ భేడా క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మరణించారు. ఆమె మరణించడానికి కారణం ఆదిల్ దురానీ. ఆమెకు సకాలంలో ట్రీట్‌మెంట్ చేయిస్తే.. ఆమె బతికి ఉండేది. నా తల్లిని అతడే చంపాడు అని ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X