For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డాన్ టార్చర్ పడలేకే పెళ్లి.. డేటింగ్‌కు వెళ్తే అలాంటి వీడియో.. రాఖీ సావంత్ షాకింగ్ సీక్రెట్స్

  |

  బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఏదో ఒక కారణంగా వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆమె తన ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో హిందీ బిగ్‌బాస్ 14 సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన రాఖీ సావంత్ తన ఆటతీరుతో వరకు టాప్ 5 వరకు వెళ్ళింది. కానీ అనూహ్యంగా 14 లక్షలు తీసుకుని హౌస్ నుంచి వాకౌట్ అయింది. ఇక ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్న ఈ భామ తన పెళ్లి గురించి షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

  ఐటెం బాంబ్

  ఐటెం బాంబ్

  బాలీవుడ్‌లో ‘మొహబత్ హై మిర్చి, దేక్తా హై తు క్యా' వంటి స్పెషల్ సాంగ్స్‌లో కనిపించిన రాఖీ సావంత్ కి హాట్ ఐటెం బాంబ్, ఐటమ్ గర్ల్ అనే పేర్లు సుస్థిరం అయిపోయాయి. అయితే తనను అలా పిలవడం పట్ల ఎలాంటి రిగ్రెట్ లేవని ఆమె తాజాగా చెప్పుకొచ్చింది. రేడియో హోస్ట్‌ సిద్దార్థ్ కన్నన్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన రాఖీ తనకు హీరోయిన్ పాత్రలు పోషించేంత టాలెంట్ లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఐటమ్స్ సాంగ్స్‌ చేయడం పట్ల తానేమీ బాధపడటం లేదని, వాటితో సంపాదించిన డబ్బుతో ఫ్యామిలీని పోషిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్‌లో తనకు ప్లేస్ దక్కడం పట్ల గౌరవంగా ఫీల్ అవుతున్నానని పేర్కొంది.

  సోనూ ప్రధాని

  సోనూ ప్రధాని

  ఇక కరోనా వేళ ప్రజలకు తానున్నానంటూ అండగా నిలుస్తున్న సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని'గా అభివర్ణిస్తూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె కామెంట్స్ మీద సోనూ సూద్ కూడా స్పందించారు. తన అపార్ట్‌మెంట్‌లో ఫొటోగ్రాఫర్లకు సమ్మర్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ కనిపించిన సోనూ సూద్.. రాఖీ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను సాధారణ వ్యక్తిగా ఉండడానికే ఇష్టపడతా'' అని క్లారిటీ ఇచ్చారు.

  సైలెంట్ మ్యారేజ్

  సైలెంట్ మ్యారేజ్

  ఆ సంగతి పక్కన పెడితే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బ్రిటన్‌కు చెందిన రితేశ్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకోవడానికి ఆమె కారణాలు ఏవీ అప్పట్లో వెల్లడించారు. కానీ అనూహ్యంగా కొన్ని నెలలు గడిచాక ఆమె పెళ్ళికి గల కారణాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన ఓ మాఫియా డాన్‌ను తప్పించుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. నిజానికి రాఖీ ప్రస్తుత భర్త ప్రపంచానికి అయితే ఇంకా రహస్యంగానే ఉన్నాడు.

  అందుకే సీక్రెట్ పెళ్లి

  అందుకే సీక్రెట్ పెళ్లి

  తాజాగా ఒక ఇంటర్వ్యూలో, రాకీ రితేష్‌తో తన వివాహం గురించి కీలక అంశాలు వెల్లడించింది. తాను ఆకస్మికంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఆమె వివరించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మాఫియా డాన్ నుంచి తప్పించుకునేందుకే రితేశ్‌ను పెళ్లాడానని రాఖీ పేర్కొంది. నరరూప రాక్షసుడు లాంటి ఆ మాఫియా డాన్ తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడని చెప్పుకొచ్చింది. మరొకరిని పెళ్లి చేసుకుంటే తన జోలికి రాడనే ఉద్దేశంతో రితేష్ తో జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యానని చెప్పుకొచ్చింది.

   'గోవాలో భయంకరమైన వీడియో

  'గోవాలో భయంకరమైన వీడియో

  సదరు డాన్ తో కలిసి డేటింగ్‌కు గోవా వెళ్లానని, అప్పుడు అతని ఫోన్ లో ఓ భయంకరమైన వీడియో నా కంటపడిందని చెప్పుకొచ్చింది. తన ఫాంహౌస్‌లో ఓ వ్యక్తిని అతడు చావగొడుతున్న దానిని వీడియో తీశారని అప్పట్నించి అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాని పేర్కొంది. కానీ అతనేమో కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటా అని బెదిరించేవాడని పేర్కొంది. ఆ సమయంలో రితేష్ పరిచయమయ్యాడని ముందు పెళ్లి కొడుకుని చూసి పెట్టమని ఆయనని అడిగితే చివరికి ఆయనే పెళ్లి కొడుకు అయ్యాడని చెప్పుకొచ్చింది. అలా మాఫియా డాన్ భయం పోయిందని ఆమె పేర్కొంది.

  English summary
  Actress Rakhi Sawant shares mindboggling things about her marriage to Ritesh, a UK based businessman. Rakhi is claiming that her marriage to Ritesh was done to keep a don from Gujarat to stay away from her. Rakhi said that After going on a date with don in Goa, she saw a video wherein the said guy was beating someone in his farmhouse. she states that so to escape from him she married ritesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X