కొత్త ప్రియుడితో రాఖీ చెట్టాపట్టాలు.. ఫోన్ చేసి నటి వార్నింగ్ లు!
రాఖీ సావంత్, అనే పేరు తెలుగులో కూడా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో తరచుగా వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. అనేక రియాలిటీ షోలలో పాల్గొన్న రాఖీ సావంత్ , తన కొత్త రిలేషన్స్ గురించి తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇక గతేడాది రాఖీ తన అభిమానులను తన భర్తకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది రాఖీ తన భర్త నుంచి విడిపోయిన విషయాన్ని కూడా ప్రకటించింది. ఇటీవల, రాఖీ జీవితంలో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో రాఖీ చాలా సంతోషంగా ఉంది. కానీ, ఈసారి కూడా రాఖీ జీవితంలో ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ వివరాల్లోకి వెళితే..

మరో యువకుడితో
రాఖీ సావంత్ అంటే వివాదం, వివాదం అంటే రాఖీ సావంత్ అని చెప్పవచ్చు. ముందు నుంచి ఎక్కువగా గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ పోజింగ్ తో శృంగార తార అనే ముద్ర పడింది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడంలో ముందుండే రాఖీ సావంత్ ఈ ఏడాది భర్త నుంచి విడిపోయిన కొన్ని నెలలకే రాఖీ మరో యువకుడితో ప్రేమలో పడింది.

నిశ్చితార్థం
అదిల్ దురాని అనే వ్యక్తితో రాఖీ సావంత్ ప్రస్తుతం గాఢంగా ప్రేమలో మునిగితేలుతోందనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేతి వేలికి ఉంగరం కూడా కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల ఓ ఫంక్షన్ లో రాఖీ సావంత్ తన కొత్త ప్రియుడిని అందరికీ మెరిసింది. రాఖీ సావంత్ మాజీ భర్త రితేష్ విషయంలో జరిగిన వ్యవహారం లాంటి వ్యవహారమే అదిల్ విషయంలో కూడా రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కొత్త తలనొప్పి
రాఖీ సావంత్ తన మాజీ భర్త రితేష్ కు ఆల్రెడీ పెళ్లి అయింది. రితేష్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రాఖీతో ప్రేమలో పడ్డారు. దీంతో అప్పుడు రాఖీ సావంత్ వివాహం చెల్లలేదు. ఈ క్రమంలో రాఖీ అతడి నుంచి ఆమె విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదిల్ విషయంలో రాఖీ సావంత్ కి కొత్త తలనొప్పి వ్యవహారం వచ్చిందని తెలుస్తోంది.

నాలుగేళ్ల పాటు రిలేషన్ లో
అదిల్ దురాని రోషినా దెలవరి అనే యువ నటితో నాలుగేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నాడట. ఇప్పుడు అదిల్ ని రాఖీ సావంత్ ప్రేమిస్తుండడంతో రోషినా రంగంలోకి దిగింది. రోషినా తనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది అని రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించింది. అదిల్ తనకు మాత్రమే సొంతం అని.. అతని నుండి దూరంగా వెళ్లాలని లేకపోతే ఊరుకోను అని రోషినా తనను బెదిరించినట్లు రాఖీ పేర్కొంది.

పెళ్లి పీటలు
అయితే ఈ విషయం మీద అదిల్ ని రాఖీ నిలదీసిందట. రోషినాను తన మాజీ ప్రియురాలని చెప్పిన ఆదిల్, రోషినా నా ఎక్స్ అని ఇప్పుడు మా మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆదిల్ చెప్పాడట. దీంతో రాఖీ రిలాక్స్ గా ఫీల్ అయింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











