రేప్ జరుగకుండా అక్కడ తాళం: రాఖీ సావంత్ షాకింగ్ వీడియో!
Recommended Video

వివాదాలు, సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాఖీ సావంత్ మరోసారి తన చర్యలతో అందరినీ ఆశ్చర్య పరిచింది. దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయనే వార్తలు ఓ వైపు, తమను లైంగికంగా వేధించారని, రేప్ చేశారంటూ బాలీవుడ్లో #మీటూ ఉద్యమం మరో వైపు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రాఖీ సావంత్ ఇలాంటి సంఘటనల నుంచి అమ్మాయిలు తమకు తాము ఎలా రక్షణ కల్పించుకోవాలో చెబుతూ షాకింగ్ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె తన లో దుస్తులకు తాళం వేసుకుని కనిపించింది.
మీ కోసం సైంటిస్టుగా మారి పరిష్కారం కనుగొన్నా
నేను మీ రాఖీ సావంత్... ఈ దేశంలోని అమ్మాయిలు, మహిళలు అత్యాచారాలకు గురి కాకుండా ఉండేందుకు సైంటిస్టుగా మారాను. మీ కోసం పరిష్కారం కనుకొన్నాను అంటూ ఆమె తన వీడియోలో పేర్కొన్నారు.

అక్కడ తాళం వేసింది
ఈ వీడియోలో లోదుస్తులు ధరించే ప్రాంతంలో రాఖీ సావంత్ నడుము చుట్టూ గొలుసుతో చుట్టుకుని తాళం వేసకుని కనిపించింది. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని ఎవరూ రేప్ చేయలేరు, మీరు ఎక్కడికి వెళ్లిన సేఫ్‌గా ఉంటారంటూ ఆమె చెప్పుకొచ్చారు.
అసభ్యంగా డాన్స్ చేస్తూ
అంతే కాకుండా నడుముకు తాళం వేసుకుని అసభ్యంగా డాన్స్ చేస్తూ మరో వీడియో పోస్టు చేసింది. రాఖీ సావంత్ పోస్టు చేసిన ఈ వీడియో చూసి కొందరు ఫన్నీగా ఉందంటూ నవ్వుకుంటుండగా, మరికొందరు రాఖీ మహిళల విషయంలో మరింత నీచానికి దిగజారింది అంటూ విమర్శిస్తున్నారు.

జుగుప్సాకరంగా
దేశంలోని మహిళలు, అమ్మాయిల విషయంలో రాఖీ సావంత్ ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఒక మహిళగా వారికి అండగా నిలవాల్సింది పోయి... ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నాపై రేప్ జరిగింది
#మీటూ ఉద్యమంపై వెటకారపు వ్యాఖ్యలు చేస్తున్న రాఖీ సావంత్..... నానా పాటేకర్ మీద ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తాను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా తనుశ్రీ దత్తా తనపై పలుసార్లు అత్యాచారం చేసిందంటూ ఆరోపణలు చేసింది.


Click it and Unblock the Notifications











