అమ్మాయిలు పడక గదికి వస్తే.. మగాళ్లు జాగ్రత్తగా ఉండాలి.. హీరోయిన్లపై రాఖీ సావంత్ సంచలనం!
ఓ వైపు మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే, మీటూకి వ్యతిరేకంగా శృంగార తార రాకీ సావంత్ సంచలనాలు కొనసాగుతున్నాయి,. హార్న్ ప్లీజ్ ఒకే చిత్ర షూటింగ్ లో భాగంగా దిగ్గజ నటుడు నానా పాటేకర్ తనని లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్త ప్రకంపనలు సృష్టించింది. తనుశ్రీ దత్త వాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలై ఓ కుదుపు కుదిపేస్తోంది. మీటూ ఉద్యమం వలన ప్రముఖ దర్శకులు, నటుల జాతకాలు బయట పడుతున్నాయి. కానీ రాఖీ సావంత్ మాత్రం మీటూ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Recommended Video


మీటూకు వ్యతిరేకంగా
రాఖీ సావంత్ మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో తనుశ్రీ దత్తపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. హార్న్ ఓకె ప్లీజ్ చిత్రంలో తనుశ్రీ దత్త తప్పుకున్న తరువాత రాఖీ సావంత్ ని స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసుకున్నారు.

తనుశ్రీకి డ్రగ్స్ అలవాటు
రాఖీ సావంత్ తనుశ్రీపై తీవ్రమైన కామెంట్స్ తో రెచ్చిపోతోంది. తనుశ్రీకి డ్రగ్స్ అలవాటు ఉందని అందువలనే ఆ చిత్రాంలోకి నన్ను తీసుకున్నారని పేర్కొంది. రాఖీ సావంత్ వ్యాఖ్యలకు తనుశ్రీ ధీటుగా కౌంటర్ ఇచ్చింది. రాఖీపై 10 కోట్ల పరువునష్టం దావా వేసింది. అయినా కూడా రాఖీ సావంత్ వెనక్కి తగ్గడం లేదు.

ఆమెలో మగాడి లక్షణాలు
తనపై పరువునష్టం దావా వేసిన తరువాత కూడా రాఖీ సావంత్ తనుశ్రీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. తనుశ్రీ దత్త ఒక లెస్బియన్. ఆమెలో మగలక్షణాలు ఉన్నాయి. నన్ను చాలా సందర్భంలో రేప్ చేసింది అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలని తనుశ్రీ ఖండించింది.

99 శాతం హీరోయిన్లు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాఖీ సావంత్ మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు వస్తున్న 99 శాతం హీరోయిన్లు సెక్స్ చేసేందుకు అంగీకారం తెలుపుతారని రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. చిత్ర పరిశ్రమకు వచ్చే అమ్మాయిలు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో వారంతట వారే పడకగదికి వెళతారని రాఖీ పేర్కొంది.

బలవంతం ఉండదు
ముందుగా అమ్మాయిలు కాస్టింగ్ డైరెక్టర్స్ వలలో పడతారు. ఆ తరువాత వవారిని ఎవరూ బలవంతం కానీ, అత్యాచారం కానీ, భయపెట్టడం కానీ ఉండదని.. అంగీకారంతోనే సెక్స్ లో పాల్గొంటారని రాఖీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇందులో ఏదైనా తప్పు జరిగితే కాస్టింగ్ డైరెక్టర్ల స్థాయిలోనే జరుగుతుందని రాఖీ తెలిపింది.

మగాళ్లు జాగ్రత్తగా ఉండాలి
అమ్మాయిలతో పడకగదిలో గడిపే మగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. పిలిచిన వెంటనే పడకగదికి వచ్చే అమ్మాయి భవిష్యత్తులో ఇలా మీటూ పేరుతో బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.


Click it and Unblock the Notifications











