అతడు కారులో బంధించి.. పై దుస్తులు విప్పించి.. బిగ్‌బాస్‌లో రాఖీ సావంత్ లబోదిబో!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 14లో పలు వివాద అంశాలతో రచ్చ చేస్తున్న శృంగార తార రాఖీ సావంత్ లబోదిబో మన్నారు. తన మొగుడు చేసిన అన్యాయాని బిగ్‌బాస్ షోలో చెప్పుకొంటూ కంటతడి పెట్టుకొన్నారు. దాంతో ఒక్కసారిగా బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా మారింది. ఇంతకు రాఖీ సావంత్‌ను కంటతడి పెట్టించిన ఆ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

స్నేహితుడే అత్యాచారయత్నం

స్నేహితుడే అత్యాచారయత్నం

బిగ్‌బాస్ హౌస్‌లో తన తోటి కంటెస్టెంట్ రాహుల్ వైద్యతో రాఖీ సావంత్ ముచ్చటిస్తూ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలు చెప్పుకొంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఓ స్నేహితుడు ఉండేవాడు. నా తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకొన్నాను. దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని నాపై అత్యాచారానికి పాల్పడ్డారు అని రాఖీ సావంత భావోద్వేగానికి గురయ్యారు.

కారులో బంధించి.. పై దుస్తులు తీయించి

కారులో బంధించి.. పై దుస్తులు తీయించి

నా స్నేహితుడు నాకు ఆర్థికంగా అండగా ఉన్నారనే విషయంతో నేను అతడిని పూర్తిగా నమ్మాను. ఓ రోజు ఫుల్లుగా మద్యం సేవించిన అతడు నన్ను ఓ ఇంపోర్టెడ్ కారులో బంధించాడు. కారు డోర్లను లాక్ చేసి నా పై దుస్తులను తొలగించమన్నాడు అని రాహుల్‌తొ చెబుతూ రాఖీ సావంత్ కంటతడి పెట్టుకొన్నారు.

రోడ్డుపైకి తోసి టార్చర్

రోడ్డుపైకి తోసి టార్చర్

నా ఫ్రెండ్ చేష్టలు అంతటితో అగలేదు. కాసేపు తర్వాత నన్ను కారులో నుంచి బయటకు తోశాడు. రోడ్డు మీద పడేసి నన్ను టార్చర్‌కు గురిచేశాడు. ఆ తర్వాత నాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఆ ఘటన తర్వాత నేను ఒంటరిగా పడుకోవాలంటే భయం వేసేది. ఆ రాత్రంతా భయంతో వణికిపోయాను. ఆ సంఘటన తర్వాత మళ్లీ అతడు నన్ను కలువలేదు అని రాఖీ సావంత్ ఆవేదన వ్యక్తం చేసింది.

నా భర్తకు ముందే పెళ్లి జరిగింది

నా భర్తకు ముందే పెళ్లి జరిగింది

ఇక నా భర్త రితేష్ కూడా నన్ను దారుణంగా మోసగించాడు. నాతో పెళ్లికి ముందే అతడికి పెళ్లి జరిగి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని దాచి పెట్టి నన్ను పెళ్లి చేసుకొన్నాడు. నేను పెళ్లి చేసుకొన్న తర్వాత రితేష్ వైవాహిక జీవితం గురించి తెలిసింది. అప్పటికే నా జీవితంలో జరుగాల్సిన నష్టం జరిగిపోయింది అని రాఖీ సావంత్ పేర్కొన్నారు.

విడాకులు ఇస్తానని బెదిరింపులు

విడాకులు ఇస్తానని బెదిరింపులు

పెళ్లి తర్వాత నాకు తెలిసిన విషయాన్ని ప్రస్తావిస్తే రితేష్ బెదిరింపులకు పాల్పడ్డారు. దాదాపు ఐదుసార్లు విడాకులు ఇస్తానని బెదిరించాడు. దాంతో జరిగిన విషయాలను పక్కన పెట్టి నా దాంపత్య జీవితాన్ని చక్కబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ బిగ్‌బాస్ హౌస్‌లో తన జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను రాహుల్ వైద్యతో చెప్పుకొంటూ రాఖీ సావంత్ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X