రాఖీ సావంత్ షాకింగ్ నిర్ణయం: తన శరీంలోని ఆ రెండు డొనేట్ చేస్తుందట!
Recommended Video

రాఖీ సావంత్... బాలీవుడ్ వివాదాస్పద నటీమణుల్లో ఒకరు. తన పనికి సంబంధించిన విషయాలకంటే సంచలన కామెంట్స్, వివాదాస్పద పనులతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పబ్లిసిటీ పెంచుకోవడానికి ఏం చేయడానికైనా, ఎలాంటి మాటలు మాట్లాడటానికైనా తెగించే రాఖీ సావంత్ తాజాగా తన వక్షోజాలు డొనేట్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటన చేయడం ద్వారా హాట్ టాపిక్ అయింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేసిన రాఖీ సావంత్ ఈ మేరకు తన మనసులోని మాటను బయట పెట్టింది.
వక్షోజాలు డొనేట్ చేయాలనుకుంటున్నాను
కొందరు తమ కళ్లను డొనేట్ చేస్తుంటారు. కొందరు ఊపిరి తిత్తులు డొనేట్ చేస్తుంటారు. కొందరు కిడ్నీ డొనేట్ చేస్తుంటారు. ఇలా ఈ లోకంలో ఇలాంటి మంచి పనులు చేసే వ్యక్తులు ఉన్నారు. వారి లాగే నేను కూడా సమాజ సేవ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా నా శరీరంలోని భాగాన్ని డొనేట్ చేయాలనుకుంటున్నాను. చాలా ఆలోచించిన తర్వాత వక్షోజాలు డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను అని రాఖీ సావంత్ పేర్కొన్నారు.

ఎవరికి అవసరమో తెలియదు
నా వక్షోజాలు ఎవరికి ఉపయోగపడతాయో తెలియదు. ఎవరికైనా అవసరం అయితే తప్పకుండా వాటిని డొనేట్ చేయాలనుకుంటున్నాను...... అంటూ రాఖీ సావంత్ ఇప్పటి వరకే ప్రపంచంలో ఎవరూ చేయని ప్రకటన చేసింది.

గతంలో సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు
గతంలో రాఖీ సావంత్ బ్రెస్ట్ ఇంప్లిమెంట్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. 2010లో తాను బ్రెస్ట్ ఇంప్లిమెంట్స్ తొలగించుకున్నట్లు ప్రకటించింది. చాలా మంది ఇప్పటికీ ఆమె వక్షోజాలు సహజసిద్ధమైనవి కావని బలంగా నమ్ముతుంటారు. మరి ఈవిడ ప్రకటనపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఆల్రెడీ ట్రోలింగ్ మొదలైంది
రాఖీ ఈ ప్రకటన చేస్తూ వీడియో పోస్టు చేయగానే ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సమాజ సేవ చేయడానికి మహాగొప్ప నిర్ణయం తీసుకున్నావంటూ పలువురు ఎత్తిపొడుస్తున్నారు. కొందరైతే నీ ప్లాస్టిక్ వక్షోజాలు ఎవరికీ ఉపయోపడవు అంటూ సెటైర్లు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











