చావు బతుకుల్లో రాఖీ సావంత్ తల్లి.. సల్మాన్ ఖాన్ ఏం చేశాడంటే!
చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న తన తల్లికి ఆర్థిక సహాయం అందించిన సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కుటుంబంపై రాఖీ సావంత్ ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన తల్లి జయ సావంత్ గురించి, ఆమె వ్యాధి, చికిత్స గురించి వెల్లడించింది.
రాఖీ సావంత్ విడుదల చేసిన వీడియోలో జయ మాట్లాడుతూ.. నా కుమారులతో సమానమైన సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్‌కు థ్యాంక్స్. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ముంబైలోని ఓ హాస్పిటల్‌లో ఉన్నాను. కెమియోథెరపీ జరుగుతున్నది.

నాకు ఆర్థికంగా సహాయం అందించిన మీరు ఎల్లప్పుడు విజయంతో ముందుకెళ్లాలి. మీ ఆరోగ్యంతో పది కాలాలపాటు ఉండాలని ఆశీర్వదించారు. ఆ తర్వాత రాఖీ మాట్లాడుతూ.. థ్యాంక్యూ సల్మాన్ జీ.. యూ ఆర్ ఏ రాక్‌స్టార్ అంటూ కామెంట్ చేసింది.
రాఖీ సావంత్ తల్లి జయను ఇటీవల కష్మీరా షా, సంభవనా సేత్ తదితరులు పరామర్శించారు. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ 14వ సీజన్‌లో రాఖీ సావంత్ 14 లక్షల పారితోషికంతో గేమ్ నుంచి నిష్క్రమించారు.


Click it and Unblock the Notifications











