Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాఖీ సావంత్ మీద దాడి: చంపించేందుకు ఆ ముగ్గురూ కుట్ర చేశారా?
బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. హర్యానాలోని పంచకులలో ఏర్పాటు చేసిన రెజ్లింగ్ షోలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా ఓ లేడీ రెజ్లర్ దాడి చేసింది. ఆమెను అమాంతం పైకి ఎత్తేసి కింద పడేసింది. ఈ ఘటనలో గాయపడ్డ ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
బికినీలో రాఖీ సావంత్ హల్చల్... చివరకు అది చూపి షాకిచ్చింది!
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని ఈ సంఘటన చూసి అక్కడున్నవారంతా షాయ్యారు. అయితే తనపై దాడి జరుగడం శత్రువల కుట్రే అని రాఖీ సావంత్ ఆరోపించారు.
|
ఆ ముగ్గురే దాడి చేయించారు
తనపై దాడి చేయించింది తన శత్రవులు తనుశ్రీ దత్తా, హనీ ప్రీత్ ఇన్సాన్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అయి ఉంటారని రాఖీ సావంత్ ఆరోపించారు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ పని చేయించినట్లు తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
చంపడం లేదా డాన్స్‌కు పనికి రాకుండా చేయాలనే!
ఆసుపత్రిలో చేరిన రాఖీ సావంత్ స్పందిస్తూ... తనను చంపడం లేదా ఇకపై డాన్స్ చేయకుండా తీవ్రంగా పరచడమే వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోందని తెలిపారు.
నా పొట్టకొట్టాలనే చేశారు
నేను ఇండియాలో పాపులర్ డాన్సర్. కేవలం డాన్స్ షోలు ఇస్తూ నేను పొట్టపోసుకుంటున్నాను. నేను డాన్స్‌కు పనికి రాకుండా చేసి నా ఉపాధి దెబ్బతీయాలనుకున్నారు. అయితే ఎవరు దాడి చేయించారో తనకు కచ్చితంగా తెలియదని తెలిపారు.
అందుకే నాపై కుట్ర
నాపై దాడి ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. హనీప్రీత్ ఇన్సాస్, గుర్మీత్ రామ్ రహీమ్ గ్యాంగ్ మీదనే నా అనుమానం. వారితో తనుశ్రీ దత్తా కూడా చేతులు కలిపి ఉండొచ్చు. ఎందుకంటే వీరు బాలీవుడ్‌లోకి వస్తే ఇండస్ట్రీ పొల్యూట్ అవుతుందని అడ్డుపడ్డాను. అందుకే నా మీద ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అని రాఖీ సావంత్ తెలిపారు.
వాస్తవంగా ఏం జరిగింది?
అయితే రాఖీ మీద రెజ్లర్ దాడికి మరో కారణం కూడా వినిపిస్తోంది. మొదట లేడీ రెజ్లర్ తనతో ఫైట్ చేయాలిన రాఖీ సావంత్‌ను ఛాలెంజ్ చేసింది. దీంతో దమ్ముంటే నాతో డాన్స్ చేయాలిని రాఖీ కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. అయితే ఉన్నట్టుండి లేడీ రెజర్లర్ రాఖీని అమాంతం ఎత్తి కిందపడేసిందని అంటున్నారు.
తనుశ్రీ దత్తా, రాఖీ సావంత్ గొడవ
#మీటూ ఉద్యమం నేపథ్యంలో రాఖీ సావంత్... తనుశ్రీ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై దాడి జరుగడంతో తనుశ్రీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ రాఖీ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోంది.