సమ్మర్‌లోని వేడి కంటే ఎక్కువ సెగలు పుట్టిస్తాం.. అర్జున్ కపూర్‌తో రొమాన్స్‌పై రకుల్!
ప్రస్తుతం రకుల్ ప్రీత్ బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోల పక్కన చాన్స్ కొట్టేస్తోంది. అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్, అర్జన్ కపూర్ వంటి హీరోల పక్కన నటిస్తోంది. అయితే ఇప్పుడు అర్జున్ కపూర్‌తో రకుల్ రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ముందుగానే ఓ శాంపిల్ వదిలేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. అర్జున్ కపూర్‌తో రకుల్ చేసే రొమాన్స్ గురించి ఓ అప్డేట్ వచ్చింది.
రకుల్ చివరగా తెలుగు ప్రేక్షకులను చెక్ సినిమాతో పలకరించింది. అందులో వేసిన లాయర్ పాత్ర ఓ మోస్తరుగా పేరు తెచ్చిపెట్టింది. అయితే చెక్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రకుల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక రకుల్ తన ఆశలన్నీ కూడా క్రిష్ సినిమా మీదే పెట్టుకుంది. అయితే టాలీవుడ్‌లో ఈ ఒక్క చిత్రమే చేతిలో ఉండగా.. కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో రకుల్ ఫుల్ బిజీగా ఉంది.

ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రకుల్ రచ్చ చేసేందుకు రెడీ అయింది. అర్జున్ నేను కలిసి ఈ ఎండాకాలంలో వచ్చే వేడి కంటే ఎక్కువ సెగలు పుట్టిస్తాం.. ఇది మా మొదటి పాట.. రేపు రాబోతోంది.. చూస్తూనే ఉండండి అంటూ రకుల్ హైప్ పెంచేసింది. టీ సిరీస్ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ పాట రేపు రాబోతోంది. ఇక పోస్టర్, రకుల్ చేసిన కామెంట్లు చూస్తుంటే ఇందులో రొమాంటిక్ సీన్స్ బాగానే ఉండేట్టు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











