మొగుడిని వెతుక్కో.. రకుల్‌కు తల్లిదండ్రుల పోరు.. తండ్రి వయసు వ్యక్తి ప్రేమలో...

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమైంది. తాజాగా అజయ్ దేవగన్, టబుతో కలిసి దే దే ప్యార్ దే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 50 ఏళ్ల వివాహితుడికి 26 ఏళ్ల ప్రేయసిగా కనిపించబోతున్నది. ఈ పాత్ర కోసం హాట్ హాట్‌గా తెరపైన కనిపించింది. ఈ చిత్రం మే 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ ప్రమోషన్లో విస్తృతంగా పాల్గొంటున్నది. ఈ సందర్బంగా రకుల్ మాట్లాడుతూ..

50 ఏళ్ల వివాహితుడితో ప్రేమలో

50 ఏళ్ల వివాహితుడితో ప్రేమలో

50 ఏళ్ల వివాహితుడితో ప్రేమలో పడే యువతి పాత్ర చాలా ఫన్‌గా ఉంటుంది. అందుకే ఆ పాత్రను చేయడానికి ముందుకు వచ్చాను. స్టోరీలైన్ చెప్పగానే చాలా ఆసక్తిని రేపింది. ప్రస్తుత జనరేషన్స్‌కు ఆకట్టుకొనే కథ అది. సమాజంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న ఓ పాయింట్‌ను తీసుకొని దే దే ప్యార్ దే సినిమాను రూపొందించారు. ఈ సినిమా వినోదాత్మకంగా సాగుతుంది అని రకుల్ అన్నారు.

తండ్రి వయసు ఉన్న వ్యక్తితో నా స్నేహితురాలు

తండ్రి వయసు ఉన్న వ్యక్తితో నా స్నేహితురాలు

50 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్లకు పైబడిన యువతి ప్రేమలో పడటం సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. గతేడాది నా స్నేహితురాలు తన తండ్రి కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొన్నది. ప్రేమకు వయోభేదాలు లేవు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొంటే చాలూ అని రకుల్ అన్నారు.

ప్రేమలో పడలేదు

ప్రేమలో పడలేదు

ఇంకా ప్రేమలో పడలేదునేను ఇంకా ప్రేమలో పడలేదు. ఎవరినైనా వెతుక్కో అని నా తల్లిదండ్రులు చెబుతుంటారు. నాకు ప్రేమ అంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. లవ్ గురించి ప్రస్తావన వస్తే నా కళ్లలో మెరుపులు కనిపిస్తాయి. బిజీగా ఉండటం వల్ల రొమాన్స్‌కు సమయం లేదంటే నేను ఒప్పుకోను. కానీ మన వ్యక్తిత్వానికి తగినట్టు సరైన వ్యక్తి లభిస్తే జీవితమంతా సంతోషంగా మారుతుంది అని రకుల్ పేర్కొన్నారు.

అజయ్ దేవగన్, టబు గురించి

అజయ్ దేవగన్, టబు గురించి

అజయ్ దేవగన్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి వ్యక్తి. సీనియర్ అయినప్పటికీ తోటివారితో కలిసి మెలిసి ఉంటారు. నేను కొత్త అయినా అలాంటి ఫీలింగ్ కల్పించకుండా ఆయన మసలుకొన్నారు. టబు కూడా మంచి ఫోకస్ ఉన్న యాక్టర్. వారిద్దరితో నటించడం చాలా హ్యాపీగా ఉంది.

ఫెయిల్యూరే కీలకంగా

ఫెయిల్యూరే కీలకంగా

జయాపజయాలకు కుంగిపోను.. పొంగిపోను. సక్సెస్, ఫెయ్యిల్యూర్స్ జీవితంలో ఓ భాగం. సక్సెస్ కంటే ఫెయిల్యూర్‌ చాలా ముఖ్యం. వాటితో రియాలిటీ ఎంటో తెలుస్తుంది. నాకు ప్రతీ శుక్రవారం ఓ పండుగలా అనిపిస్తుంది. సినిమా వేరు.. నిజ జీవితం వేరు. షూటింగ్ పూర్తయిన వెంటనే నా లోకంలో పడిపోతాను. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని రకుల్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X