For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. రకుల్ ప్రీత్ ఎక్కడ, ఏం చేస్తున్నారంటే.. షాకింగ్‌గా ఫోటోలు లీక్!

    |

    టాలీవుడ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. లాక్‌డౌన్ సమయంలో అంతా సవ్యంగా సాగిపోతుందనుకునే సమయంలో అనూహ్యంగా రకుల్ పేరు బాలీవుడ్ డ్రగ్స్ కేసులో వినిపించడం తెలుగు సినిమా పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలో ఆమె తనపై వస్తున్న కథనాలపై మనస్తాపం చెంది ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తాజాగా రకుల్ గురించి క్లారిటీని ఇచ్చే విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

    రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ అంటూ

    రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ అంటూ

    బాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే విషయం సినీ, మీడియా వర్గాల చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో లీకైన ఫోటోలు క్లారిటీని ఇచ్చాయి. అందరి అంచనాలకు భిన్నంగా రకుల్ ప్రస్తుతం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న క్రిష్ మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు.

    క్రిష్ దర్శకత్వంలో జరిగే షూటింగ్‌లో రకుల్

    క్రిష్ దర్శకత్వంలో జరిగే షూటింగ్‌లో రకుల్

    క్రిష్ దర్శకత్వంలో మెగా అల్లుడు, ఉప్పెన ఫేమ్ పంజా వైష్ణవ్‌తో కలిసి ఓ గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు గ్లామర్ దేవతగా కనిపించిన ఈమె పల్లెటూరి పిల్ల పాత్రలో డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు.

    పంజా వైష్ణవ్‌తో రకుల్ బీజీగా షూట్

    పంజా వైష్ణవ్‌తో రకుల్ బీజీగా షూట్

    కొద్దికాలంగా భారీగా కురుస్తున్న వర్షాలు, ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిరంతరంగా షూటింగ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ షూటింగులో రకుల్ ప్రీత్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

    ఆరోపణలు పట్టించుకోకుండా రకుల్

    ఆరోపణలు పట్టించుకోకుండా రకుల్

    డ్రగ్ కేసు ఆరోపణలు పక్కన పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం షూటింగు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పనిపైనే దృష్టిపెట్టారు అని ఆమె సన్నిహితులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వస్తున్న కథనాలను కంట్రోల్ చేయాలని ఢిల్లీ హైకోర్టును సంప్రదించడానికి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి వెంటనే వచ్చారు. షూటింగులో భాగమయ్యారు అని పేర్కొన్నారు.

    ఢిల్లీ కోర్టు ఆదేశాలతో

    ఢిల్లీ కోర్టు ఆదేశాలతో

    డ్రగ్ కేసు ఆరోపణలతో తనపై మీడియాలో కథనాలు వస్తున్నాయని ఢిల్లీ హైకోర్టును రకుల్ సంప్రదించగా సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. ప్రసార భారతీ, కేబుల్ టీవీ చట్టాలకు అనుగుణంగా కథనాలు ప్రచురించాలని, అధికారికంగా ఎవరైనా సమాచారం వెల్లడిస్తే కథనాలుగా రాయొచ్చని తన ఆదేశాల్లో కోర్టు పేర్కొన్నది.

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా

    రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా

    ఇక రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే శివ కార్తీకేయన్‌తో ఆయాలాన్ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో నితిన్‌తో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో అర్జున్ కపూర్‌తో కలిసి సరిహద్దులో జరిగే ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Bollywood Actress Rhea Chakraborty reportedly revealed that she used to consume drugs with Sara Ali Khan, Rakul Preet Singh, Simone Khambatta. In this occassion, Rakul Preet Singh files petition in Delhi High court. Now, Rakul Preet Singh busy in Krish and Panja Vaisshnav Tej's Movie Shooting at vikarabad forest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X