Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తొలి రోజు ప్లాప్ టాక్‌తో డీలా... మరి రకుల్ ఆనందానికి కారణమేంటి?
Recommended Video
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో సెటిలవ్వాలని చాలా ట్రై చేస్తోంది. అయితే అమ్ముడికి సరైన హిట్టు పడటం లేదు. రకుల్ నటించిన తాజా చిత్రం 'దే దే ప్యార్ దే'. అజయ్ దేవన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కోసం రకుల్ గ్లామర్ డోస్ పెంచి మరీ నటించింది. కానీ తొలిరోజే బాక్సాఫీసు వద్ద ఊహించని షాక్ తగిలింది. ప్లాప్ టాక్ రావడంతో పాటు చాలా తక్కువ కలెక్షన్లు నమోదయ్యాయి.
తొలి రోజే నెగెటివ్ టాక్, పూర్ కలెక్షన్లు రావడంతో రకుల్ బాలీవుడ్ ఆశలపై మరోసారి నీళ్లు చల్లినట్లయింది. పెద్ద హీరోతో చేసిన సినిమా సైతం కలిసి రాక పోవడంతో హిందీ చిత్ర సీమలో ఆమెకు అవకాశాలు పెద్దగా ఉండక పోవచ్చనే వార్తల తెరమీదకు వచ్చాయి. అయితే రెండో రోజు నుంచి పరిణామాలు కాస్త పాజిటివ్‌గా మారాయట. దీంతో రకుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
హ్యాపీ మూడ్‌లో రకుల్
రెండో రోజు నుంచి ‘దే దే ప్యార్ దే' కలెక్షన్లు జంప్ అయినట్లు... వసూళ్లు పుంజుకున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడంతో నిరాశలో ఉన్న రకుల్ హ్యాపీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. మెట్రో సిటీల్లో మంచి ఆదరణ పొందడంతో పాటు టైర్ 2 నగరాల్లో మాస్ ఆడియన్స్‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు.
ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఎంత?
రిలీజ్ రోజైన శుక్రవారం రూ. 10.41 కోట్లు రాబట్టిన ఈ మూవీ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా శనివారం రూ. 13.39 కోట్లు, ఆదివారం పలు ఏరియాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ రూ. 14.74 కోట్లు వసూలు చేసినట్లు తరణ్ ఆదర్శ్ తెలిపారు. దీంతో ఫస్ట్ వీకెంట్ కలెక్షన్స్ రూ. 38.54 కోట్లకు రీచ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా విజయంపైనే రకుల్ బాలీవుడ్ భవిష్యత్
‘దే దే ప్యార్ దే' విజయం మీదే తన బాలీవుడ్ భవిష్యత్ ఆదారపడి ఉండటంతో రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకు ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. సినిమా బావుంది అనే ప్రతి కామెంటును ఆమె రీట్వీట్ చేస్తున్నారు. మరి రకుల్ ప్రయత్నాలు ఫలిస్తాయో? లేదో? అనేది సినిమా ఫుల్ రన్ పూర్తయితే కానీ చెప్పలేం.
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె తెలుగులో నాగార్జునకు జోడీగా ‘మన్మధుడు 2' చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తమిళంలో శివకార్తికేయన్ మూవీలో నటిస్తోంది. సూర్యతో చేసిన ‘ఎన్.జి.కె' ఈ నెల 31న విడుదల కాబోతోంది. ‘మార్ జవాన్' అనే మరో హిందీ చిత్రం కూడా చేస్తోంది.