9.5 కోట్లు మోసం.. డైరెక్టర్‌పై రకుల్ ప్రీత్ సింగ్ భర్త కేసు!
నార్త్ నుంచి వచ్చి సౌత్ లో ఉన్నన్నినాళ్ళు మంచి ఫేమ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకొని బాగానే సంపాదించుకొని మళ్ళీ నార్త్ లో సెటిల్ అయ్యిపోయిన హీరోయిన్స్ ఇప్పుడు చాలా మందే ఉన్నారని చెప్పాలి. అలాగే ఈ లిస్ట్ లో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. కాగా నార్త్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లలోనే భారీ సినిమాలు చేసి స్టార్ అయ్యిపోయింది.
అలాగే దాదాపు తెలుగు సినిమాలో దాదాపు అందరి స్టార్స్ సరసన నటించేసిన రకుల్ ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ లేక హిందీ మార్కెట్ లోకి మళ్ళీ వెళ్ళిపోయింది. పోనీ అక్కడకి వెళ్లినా కూడా అక్కడా పెద్ద హిట్ సినిమాలూ లేవు, వెబ్ సిరీస్ లు లేవు. దీనితో జాకీ భగ్నానీ అనే బిజినెస్ మెన్ కం సినీ నిర్మాతని ఆమె పెళ్లి చేసేసుకొని సెటిల్ అయ్యిపోయింది.

కాగా ఇపుడు ఈమె భర్తే ఈ జాకీ భగ్నానీ అనే అతను ఓ దర్శకుడు విషయంలో కేసు వేయడం వార్తల్లోకి ఎక్కింది. కాగా జాకీ భగ్నానీ ఇటీవల బాలీవుడ్ లో భారీ యాక్షన్ కం డిజాస్టర్ సినిమా "బడే మియా చోటే మియా" అనే సినిమాకి నిర్మాణం వహించారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్ నటించగా సోనాక్షి సిన్హా, మానుషీ చిల్లర్ లాంటో హాట్ బ్యూటీస్ ఈ చిత్రంలో నటించారు.
కాగా ఈ చిత్రాన్ని అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. అయితే ఇదే దర్శకుడు విషయంలో ఇపుడు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ అలాగే మరో నిర్మాత కలిసి ఈ సినిమా విషయంలో దర్శకుడు మమ్మల్ని మోసం చేసాడని ముంబై పోలీసుని ఆశ్రయించినట్టుగా వార్తలు బయటకి వచ్చాయి. ఈ అలీ అబ్బాస్ జాఫర్ అనే దర్శకుడు ఏకంగా తమకి తొమ్మిదిన్నర కోట్లకి పంగనామాలు పెట్టేసాడట.

దీనితో తమకి లెక్కలు చూపించకుండా ఇతడు 9.5 కోట్లు తినేసాడని వారు చెబుతున్నారు. దీనితో ప్రస్తుతానికి ఈ కేసు విషయంలో బి టౌన్ లో రచ్చ నడుస్తుంది. కాగా బాలీవుడ్ లో ఈ బడే మియా చోటే మియా అనే సినిమా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ సినిమాలో మేటర్ లేక తేలిపోయింది. దీనితో అలా కూడా ఈ చిత్రానికి భారీ నష్టాలే మిగిలాయి.
దానికి తోడు మళ్ళీ దర్శకుడు ఇలా చేయడంతో రకుల్ భర్తకి డబుల్ అయ్యింది అని చెప్పాలి. మరి ఈ కేసు విషయంలో ఫైనల్ గా ఏమవుతుంది అనేది చూడాలి. ఇంకా మరోపక్క రకుల్ అండ్ జాకీ భగ్నానీ ఇద్దరూ తమ పర్శనల్ లైఫ్ లో బాగానే ఉన్నారు కానీ మధ్యలో ఇది ఊహించని ట్విస్ట్ గా మారింది.


Click it and Unblock the Notifications











