రకుల్ ప్రీత్ సింగ్ భర్తపై తీవ్ర ఆరోపణలు.. చిక్కుల్లో జాకీ.. ఏం జరిగిందంటే?
సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాతి భగ్నానిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జాకీ భగ్నాని నిర్మాణ సంస్థ వివాదాల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. జాకీకి చెందిన పూజ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ 100 మందికి 2 సంవత్సరాల నుంచి జీతం చెల్లించలేదు అనే షాకింగ్ విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ తాజా వివాదంపై ఓ లుక్కేద్దాం పదండి.
జాకీ భగ్నాని, వాసు భగ్నాని నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ పూజ ఎంటర్టైన్మెంట్ తమ సిబ్బందికి చాలా కాలంగా జీతాలు చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడినట్టుగా తెలుస్తోంది. పని పూర్తయిన 40 నుంచి 50 రోజుల తర్వాత ఇవ్వాల్సిన డబ్బుల కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

పూజ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన ఒక ఎంప్లాయి ఈ విషయాన్ని ఇన్ గ్రామ్ లో షేర్ చేస్తూ కంపెనీ తీరును ఖండించారు. రుచితా కాంబ్లే అనే క్రూ మెంబర్ ఇన్ స్టాగ్రామ్ లో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసి డబ్బులు ఇవ్వడం చేతకానప్పుడు సినిమాలు ఎందుకు చేస్తారు ? అన్న రేంజ్ లో ఇచ్చి రాస్కొచ్చారు. పైగా ఇంకెవరు ఈ నిర్మాణ సంస్థతో పని చేయొద్దు అంటూ, బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.
తను సాధారణంగా ఇలాంటి పోస్టులు చెయ్యను అని చెబుతూనే, కష్టపడి సంపాదించిన డబ్బు కోసం ప్రతి రోజు తన టీం పడుతున్న కష్టాన్ని చూసి ఇలా మాట్లాడాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చింది. తనతో పని చేసేవారు తమ సొంత డబ్బు కోసం పూజ ఎంటర్టైన్మెంట్ అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ ను చాలా కాలంగా భరించారని ఆ పోస్ట్ లో వెల్లడించారు.

మా సొంత డబ్బును అడగడానికి మేము వాళ్లను, వీళ్లను అడుక్కోవాల్సి వస్తుంది. నేను 2 సంవత్సరాల క్రితం ఒక ప్రసిద్ధ ప్రొడక్షన్ హౌజ్ తో సినిమా చేశాను. నేను నా సిబ్బందిలో దాదాపు 100 మందితో పాటు నా 2 నెలల జీతం కోసం దాదాపు 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. సినిమాలో నటించిన నటీనటులకు మాత్రం వెంటనే రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు నటులు కాబట్టి. మా ప్రశ్నకు ఏ నిర్మాత దగ్గర సమాధానం లేదు.

నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ ఉంది ? మరీ ముఖ్యంగా నా కష్టానికి తగిన డబ్బు ఎప్పుడు వస్తుంది ? వారికి జీతం వస్తుందనే ఆశ లేదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన పోస్ట్‌ను షేర్ చేయమని తన స్నేహితులను కూడా సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. కంపెనీతో పని చేయడం మానుకోవాలని కూడా ఆమె కోరారు. తన సమస్యను కవర్ చేయాలని మీడియా ప్రతినిధులకు రిక్వెస్ట్ చేశారు. ఆమె తన పోస్ట్‌లో చాలా మందిని ట్యాగ్ చేశారు. కొంత మంది తమ ఇన్‌స్టా స్టోరీలో తన పోస్ట్‌ను షేర్ చేశారు. అయితే ఈ వివాదంపై పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇంకా స్పందించలేదు.


Click it and Unblock the Notifications











