Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
దక్షిణాదిలో అగ్రతారగా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. గత కొద్దికాలంగా ఆమె పెళ్లి వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే అధికారికంగా పెళ్లి గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మీడియాలో ఆమె పెళ్లి తేదీ వార్త వైరల్ అవుతున్నది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తేదీ, ఆమె ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరాదికి చెందిన రకుల్ ప్రీత్ సింగ్‌ను దక్షిణాది సినీ పరిశ్రమ అక్కున చేర్చుకొన్నది. ఆమె పలువురు స్టార్ హీరోలతో జతకట్టి గ్లామర్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకొన్నది. కొంతకాలంగా ఆమె బాలీవుడ్‌పైనే దృష్టిపెట్టింది. ఓటీటీ, థియేట్రికల్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డారు. తన సోషల్ మీడియా ద్వారా తన అఫైర్ విషయాన్ని బయటకు వెల్లడించారు. దాంతో ఆమె లవ్ ట్రాక్‌కు అఫీషియల్ అయిపోయింది. దాంతో ఆమె పెళ్లి వార్తలు కూడా మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించాయి. ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్త మరింత జోరందుకొన్నది.
తాజాగా రిపోర్టు ప్రకారం జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ వివాహం గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో జరుగనున్నది. రెండు రోజులపాటు జరిగే ఈ పెళ్లి తంతుకు వేదికను సిద్దం చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 21వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్నేహితులకు ఆహ్వానాలు పంపినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











