twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాకిస్థాన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సినిమాపై నిషేధం..

    By Rajababu
    |

    భారతీయ మిలిటరీలో అక్రమాలు, అవకతవకలను ఎలుగెత్తి చూపే చిత్రంగా రూపొందిన ఐయారీ చిత్రానికి పాకిస్థాన్‌లో చుక్కెదురైంది. ఆ చిత్రాన్ని రిలీజ్ కాకుండా పాక్ అధికారులు నిషేధం విధించారు. ఫిబ్రవరి 16న రిలీజైన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే రూపొందించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పేయ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రం భారతీయ సెన్సార్ బోర్డు వద్ద పలు సమస్యలు ఎదుర్కొన్నది. వివరాల్లోకి వెళితే..

     నీరజ్ పాండేకు మరోసారి చేదు అనుభవం

    నీరజ్ పాండేకు మరోసారి చేదు అనుభవం

    పాకిస్థాన్‌లో దర్శకుడు నీరజ్ పాండే చిత్రాలకు చేదు అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అక్షయ్ కుమార్ నటించిన బేబీ, తాప్సీ నటించిన నామ్ షబానా, ఎంఎస్ ధోని చిత్రాలు నిషేధానికి గురయ్యాయి. తాజాగా ఐయారీ చిత్రంపై కూడా పాకిస్థాన్ నిషేధం విధించిందని ఆ చిత్ర పాక్ పంపిణీదారుడు సతీష్ ఆనంద్ తెలిపారు.

     నా వల్ల సమస్య కాదు..

    నా వల్ల సమస్య కాదు..

    పాక్‌లో ఐయారీ సినిమాపై నిషేధంపై దర్శకుడు నీరజ్ పాండే స్పందించారు. నా వల్ల సమస్య ఎదురుకాలేదు. సినిమా వల్లనే ఇబ్బంది ఎదురైంది. దేశభక్తి నేపథ్యంగా ఐయారీ సినిమా రూపొందించాం. అది పాక్ అధికారులకు నచ్చలేదు అని నీరజ్ తెలిపారు. గతంలో ఎంఎస్ ధోని సినిమా ప్రదర్శనకు కూడా అభ్యంతరం చెప్పారని ఆయన పేర్కొన్నారు.

     దేశభక్తి సినిమాలు తీస్తా

    దేశభక్తి సినిమాలు తీస్తా

    దేశభక్తి అంశాలు ప్లాన్ చేసి నా సినిమాలో పెట్టను. ఒకవేళ ప్లాన్ చేసిన అవి వర్కవుట్ కావు. తొలి ఐయారీని ఓ లవ్‌స్టోరిగా రూపొందించాలని అనుకొన్నాను. కానీ అది జరుగలేదు. ఓ కథను అనుకొని స్టార్ట్ చేస్తాను... నన్ను ఉద్వేగానికి గురిచేసే అంశాలు ఎప్పటికప్పుడు వెంటాడుతుంటాయి. దాంతో కథ మారిపోతుంది అని నీరజ్ వెల్లడించారు.

     ఐయారీకి సెన్సార్ ఇబ్బందులు

    ఐయారీకి సెన్సార్ ఇబ్బందులు

    సినిమా రిలీజ్‌కు ముందు ఐయారీ సెన్సార్ వివాదంలో చిక్కుకున్నది. దాదాపు మూడు వారాలు విడుదల వాయిదా పడింది. మిలిటరీ అధికారులకు ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వారు చూసిన తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించి.. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ చిత్రం విడుదలకు నోచుకొన్నది.

    English summary
    Aiyaary features Sidharth Malhotra and Manoj Bajpayee in the roles of army officers who want to bring the corruption within the system to the forefront.Aiyaary has become Neeraj Pandey’s third film to be banned in Pakistan. His Baby and Naam Shabana were earlier refused release in Pakistan as well. Satish Anand, who was supposed to distribute Aiyaary in Pakistan, said, “The film is banned. Its content was disapproved.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X