రకుల్ ప్రీత్, సారా ఆలీఖాన్‌కు సమన్లు? మరో ఇద్దరి పేర్లు.. త్వరలోనే విచారణ.. ఎన్సీబీ ధృవీకరణ

హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మరోసారి కొరడా ఝులిపించేందుకు సిద్దమవుతున్నది. అధికారుల విచారణ సందర్భంగా సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ పేర్లు రియా చక్రవర్తి వెల్లడించినట్టుగా కథనాలు మీడియాలో వచ్చాయి. ఈ నేపథ్యంలో సారా ఆలీ ఖాన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..

మరో ఇద్దరి పేర్లు తెరపైకి

మరో ఇద్దరి పేర్లు తెరపైకి

ఎన్సీబీ అధికారుల విచారణలో రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్‌, సైమోన్ ఖంబట్టాతోపాటు 25 మంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా ముఖేష్ చాబ్రా, రోహిణి అయ్యంగార్ పేర్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. బాలీవుడ్ పార్టీలలో వారు విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకొన్నట్టు రియా వెల్లడించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నట్టు కథనాలు వస్తున్నాయి.

25 మందితో కూడిన జాబితా

25 మందితో కూడిన జాబితా

రియా, రకుల్ ప్రీత్ సింగ్‌, డిజైనర్ సైమోన్‌కు డ్రగ్స్ వాడకం, సమకూర్చుకోవడం, సరఫరా చేయడం లాంటి అంశాలతో సంబంధాలు ఉన్నాయి అని నార్కోటిక్స్ అధికారులు స్పష్టం చేశారు. ఎన్సీబీ వద్ద దాదాపు 25 మందితో కూడిన జాబితా ఉంది. ఆ ముగ్గురికి బలమైన సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ అధికారి కేపీఎస్ మల్హోత్రా తెలిపినట్టు టైమ్స్ నౌ బ్రేకింగ్ న్యూస్‌ను సోమవారం సాయంత్రం ప్రసారం చేసింది. త్వరలోనే రకుల్, సారాకు సమన్లు జారీ చేయవచ్చనే విషయాన్ని తమ కథనాల్లో ప్రస్తావించారు.

కామన్‌గా డ్రగ్స్ సప్లయిర్స్

కామన్‌గా డ్రగ్స్ సప్లయిర్స్

రియా చక్రవర్తిని విచారించిన సమయంలో వెలుగు చూసిన డ్రగ్స్ సప్లయిదారులందరినీ ఎన్సీబీ అరెస్ట్ చేసింది. రియాకు, సారా ఆలీ ఖాన్‌కు మధ్య కామన్‌గా ఓ డ్రగ్స్ సప్లయర్ ఉన్నాడు. వారిద్దరికి ఒకరే సరఫరా చేశారు. సారా నుంచి రియా కొన్నిసార్లు డ్రగ్స్ తీసుకొన్నది అని జీన్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది.

సారా ఆలీ ఖాన్ సొంతంగా కూడా

సారా ఆలీ ఖాన్ సొంతంగా కూడా

రియా చక్రవర్తితో సంబంధం లేకుండా సొంతంగా సారా ఆలీ ఖాన్ డగ్ర్స్ సమకూర్చుకొనేది. రియా తనకు ఉన్న పరిచయాలతో మాదక ద్రవ్యాలను సమకూర్చుకొని సుశాంత్‌కు అందించేంది అనే విషయం డ్రగ్స్ సప్లయర్లు విచారణలో తెలిపింది. ఈ నేపథ్యంలో రియాకు, సారాకు ఇంకా ఎవరైనా సరఫరా చేసిన సప్లయిర్స్ ఉన్నారా? అనే కోణంలో ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్నది అని జీన్యూస్ తన కథనంలో పేర్కొన్నది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
డ్రగ్స్ సప్లయిదార్ల అరెస్ట్

డ్రగ్స్ సప్లయిదార్ల అరెస్ట్

గత కొద్ది రోజులుగా పలువురు డ్రగ్స్ సప్లయర్లను ముంబై, గోవా నుంచి అదుపులోకి తీసుకొన్నారు. కరమ్ జిత్ సింగ్ ఆనంద్, డ్వేయిన్ ఫెర్నాండేజ్, సంకేత్ పటేట్, అకుంష్ అండ్రేజా, సందీప్ గుప్తా, అఫ్తాబ్ ఫతే అన్సారీ తదితరులను సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X