అనూహ్యంగా రకుల్ ప్రీత్ షూటింగ్ రద్దు.. రన్‌వేపై ఉండగా ఆ వార్త.. వెంటనే క్రిష్‌కు ఫోన్
దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బాలీవుడ్ డ్రగ్ రాకెట్‌లో బయటకు రావడం సంచలనంగా మారింది. తన పేరు మీడియాలో నానుతున్న సమయంలో స్పందించకపోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ హాజరు కావాల్సిన షూటింగు అనుకోకుండా వాయిదా పడటం మరో వార్తగా నిలిచింది. అయితే ఆ షూటింగ్ ఎందుకు వాయిదా పడిందంటే..

అర్జున్ కపూర్, జాన్ అబ్రహంతో
సరిహద్దు నేపథ్యంగా లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న చిత్రంలో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్‌తో కలిసి రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్వల్జిత్ సింగ్, నీనా గుప్తా లాంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. కాష్వీ నాయర్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, నిఖిల్అద్వానీ, జాన్ అబ్రహం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరో 14 రోజుల షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుంది.

సెప్టెంబర్ 14వ వరకు షూటింగ్
రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగు కోసం ముంబైలో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 14వ వరకు షూటింగ్ జరుగాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. తన సహచర నటుడు అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో సడెన్‌గా షూటింగును నిలిపివేశారు అని

రన్ వే ఉండగానే షూటింగ్ వాయిదా వార్త
తన సినిమా షూటింగు వాయిదా పడిన విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ.. రన్‌వే ఉండగానే నాకు ఓ ఫోన్ వచ్చింది. ఓ అర్ధగంట ముందుగా ఫోన్ చేసి ఉంటే నేను ఫ్లయిట్ ఎక్కి ఉండే దానిని కాదు. పరిస్థితులు చెప్పి రాలేవుగా అంటూ శుక్రవారం సాయంత్రం రకుల్ ప్రీత్ మీడియాతో అన్నారు.

డైరెక్టర్ క్రిష్‌కు ఫోన్
అర్జున్ కపూర్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని వెంటనే డైరెక్టర్ క్రిష్‌కు కాల్ చేశాను. సెప్టెంబర్ 15 నుంచి 10 రోజులపాటు జరిగే షూటింగు ముందుకు జరిపే అవకాశం ఉందా అని అడిగాను. ఆ తర్వాత నేను హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాను అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
Recommended Video

రకుల్ ప్రీత్‌కు డ్రగ్స్ లింకులు అంటూ
ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం రాత్రి టైమ్స్ నౌ జాతీయ టెలివిజన్ ఛానెల్ సంచలన కథనాన్ని వెల్లడించింది. ఎన్సీబీ అధికారులు దర్యాప్తులో సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, మరో డిజైనర్‌కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని రియా చక్రవర్తి బయటపెట్టినట్టు కథనంలో పేర్కొన్నది. దాంతో ఆ వార్త బాలీవుడ్, టాలీవుడ్‌లో కలకలం రేపింది.


Click it and Unblock the Notifications











