షూటింగులో భారీ ప్రమాదం.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు తీవ్ర గాయాలు!
బాలీవుడ్ సినిమా పరిశ్రమను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. సైఫ్ ఆలీ ఖాన్‌పై అగంతకుడి దాడి ఘటనను ఇంకా మరిచిపోకముందే హిందీ సినిమా పరిశ్రమలో మరో ప్రమాదం చోటు చేసుకొన్నది. ముంబైలో జరుగుతున్న మేరే హస్బండ్ కే బీవీ సినిమా షూటింగులో పై కప్పు కూలి పడటంతో రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో హీరో కూడా గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి వైద్య చికిత్సను అందించారు. ఆ ప్రమాద సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ జంటగా ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో జాకీ భగ్నానీ నిర్మాతగా మేరే హస్పండ్‌కే బీవీ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ముంబైలోని రాయల్ పాల్స్మ్ ప్రాంతంలో పాటను భారీగా చిత్రీకరిస్తున్నారు. అయితే ఖర్చుకు వెనుకాడకుండా సెట్ వేసి పాటను చాలా రిచ్‌గా ఈ పాటను షూట్ చేస్తున్నారు. అయితే అనుకోకుండా పై కప్పు కూలడంతో ప్రమాదం సంభవించింది.

షూటింగులో జరిగిన ప్రమాదంలో నిర్మాత జాకీ భగ్నానీ, దర్శకుడు అజిజ్, హీరో అర్జున్ కపూర్, చిత్ర యూనిట్‌లోని మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే జాకీ భగ్నానీ, అర్జున్ కపూర్‌కు స్వల్పంగానే అయినప్పటికీ.. ఇంటర్నల్‌గా బలమైన గాయలు తగిలాయి. వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించాం. ఈ ఘటన వెనుక ఏదైనా సాంకేతిక లోపం ఉందా? ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నాం అని చిత్ర యూనిట్‌కు చెందిన కీలక వ్యక్తి వెల్లడించారు.
అర్జున్ కపూర్ షూటింగులో జరిగిన ప్రమాద ఘటనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఘటనపై సరైన దర్యాప్తు చేపట్టాలని బీఎంసీ అధికారులను సూచించాం. సినీ ప్రముఖుల భద్రత, సురక్షితను దృష్టిలో పెట్టుకొని ఈ ఫిర్యాదు చేశాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
సాధారణంగా సినిమా షూటింగులను కథ డిమాండ్ మేరకు పురాతన భవనాల్లో షూటింగ్ చేస్తుంటాం. ఆ సమయంలో వాటి పటిష్టత గురించి జాగ్రత్తలు తీసుకొంటాం. మేము షూట్ చేస్తున్న పురాతన భవనంలో భద్రత ఎంత అనే విషయాన్ని సరిగా పరిశీలించలేదు. అందుకు కారణమైన ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి సంజాయిషీ లేఖను అడిగాం అని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ప్రమాదం సంభవించగానే షూటింగ్ నిలిపివేశాం. ప్రస్తుతం నిర్మాత జాకీ భగ్నానీ, అర్జున్ కపూర్, దర్శకుడు కోలుకొంటున్నారు. వారికి స్పల్ప గాయాలు కావడంతో కొద్ది రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అదృష్టవశాత్తూ భారీ ప్రమాదమే తప్పింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











