బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ హవా
గతేడాది ఒక్క హిట్టూ కొట్టకపోయినా... చేతి నిండా సినిమాలతో బిజీగానే గడిపేసిన రకుల్ ప్రీత్ సింగ్... ఈ ఏడాది బాలీవుడ్ పైనే బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ, లాడ్ డౌన్ పుణ్యమాని అమ్మడి ఆశలపై బక్కెట్టుడు నీళ్లు జల్లినట్లైంది. అయితే ఈ బ్రేక్ అమ్మడి స్పీడ్ కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. తెలుగులో కాస్త ఊపు తగ్గింది అని ఫీలవుతోందేమో... బాలీవుడ్ లో ఎలాగైనా పాగా వేసేందుకు పావులు కదుపుతోంది.

ఆఫర్లపై దృష్టి పెట్టిన బ్యూటీ
ఐదేళ్ల క్రితం చేసిన సిమ్లా మిర్చి సినిమా.. ఈ ఏడాది జనవరిలోనే విడుదలైంది. రివ్యూల పరంగా ఇది పెద్దగా కలసి రాకపోయినా రకుల్ మాత్రం దొరికిన ఫ్రీటైమ్ లో బాలీవుడ్ లో ఆఫర్లను ఒడిసిపట్టుకోవడం పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తనకు ఆఫర్లు ఇచ్చిన పాత డైరెక్టర్లను గట్టిగానే పట్టుకుంది అమ్మడు.

గతేడాది బాలీవుడ్‌లో
గతేడాది బాలీవుడ్ లో దేదే ప్యార్ దే, మర్జావా సినిమాల్లో నటించింది రకుల్. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బాగానే కాసులు కురిపించాయి. అమ్మాయి నటనకూ మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా దేదే ప్యార్ దేతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ఇప్పుడు సీక్వెల్ ద్వారాను మరింత క్రేజ్ సంపాదించుకునేందుకు సిద్ధమైంది.

దేదే ప్యార్ దే సీక్వెల్‌లో
ఇటీవలే దేదే ప్యార్ దే సినిమాకు సీక్వెల్ రాబోతోందన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ ముచ్చట చెవిన పడటం ఆలస్యం వెంటనే ఆ సినిమా డైరెక్టర్ కు మసేజ్ పంపించిందట అమ్మడు. ఈ విషయాన్ని స్వయంగా రకులే మీడియాతో షేర్ చేసుకుంది. అంతేకాదు అటువైపు నుంచి సదరు దర్శకుడు కూడా సానుకూలంగానే స్పంచించాడట. కాబట్టి, లాక్ డౌన్ లోనూ అమ్మాయి మంచి ఆఫరే పట్టేందని అనుకోవచ్చు. ఇక రకుల్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ను ఓ ఊపు ఊపడమే తరువాయి అన్నమాట.

రకుల్ ప్రీత్ సినిమాలు
రకుల్ ప్రతీ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో షిమ్లా మిర్చి, జాన్ అబ్రహంతో ఎటాక్, అజయ్ దేవగన్‌తో థ్యాంక్స్ గాడ్, తమిళంలో శివకార్తికేయన్‌తో ఆయాలన్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో చివరిగా మన్మథుడు 2లో నటించారు. తాజాగా బాలీవుడ్‌లో దేదే ప్యార్ దే సీక్వెల్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











