సైఫ్ రాకపై డార్లింగ్ ఆసక్తి...
ఆదిపురుష్ పై సినీ ప్రియులు ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో, అంతకు వెయ్యి రెట్లు ఎక్కవగా అందులో నటిస్తున్నవారే మరింతగా ఎగ్జైట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా కన్ఫామ్ అయిపోవడంతో, అతడితో కలసి ఎప్పుడెప్పుడు నటించేస్తానా అని డార్లింగ్ ప్రభాస్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
సైఫ్ తో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేసిన ప్రభాస్, అంతటి ప్రతిభావంతుడైన నటుడితో కలసి నటించడంపై హర్షం వ్యక్తం చేశాడు. అయితే ప్రభాస్ ట్వీట్ కు ధీటుగా మన రావణుడు అదే సైఫ్ కూడా అదే రేంజ్ లో రిప్లై ఇచ్చేశాడు. ప్రభాస్ పై కత్తి దూసేందుకు ఎదురుచూస్తున్నాను, రాక్షసుడిని తలపించే పాత్ర పోషించడం ఎంతో కొత్తగా ఉందంటూ సైఫ్ కూడా ట్వీట్ చేశాడు.

మరోవైపు ఆదిపురుష్ లోకి సైఫ్ ఎంట్రీ ఇవ్వడం పై కొంత మంది ఆసక్తిని వ్యక్తం చేయగా మరో వర్గం వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బంధుప్రీతి పై జరుగుతున్న అనధికార యుద్ధమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
సైఫ్ కూతురు సారా అలిఖాన్ కొంతకాలం సుశాంత్ సింగ్ తో డేటింగ్ చేసిన సంగతి బయటకు వచ్చిన నేపథ్యంలో సైఫ్ సుశాంత ను తన కూతురుకి దూరంగా ఉండమని హెచ్చరించాడని వినిపిస్తోంది. దీంతో, ఇలాంటి నటుడిని ఆదిపురుష్ లోకి తీసుకోవడం పై కొందరు విమర్శిస్తున్నారు. ఏమైనా ఈ విమర్శలకు అతీతంగా, ఆదిపురుష్ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా జరిగిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











