ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవాడు.. సుశాంత్ మృతిపై రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పందన
బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మానసికంగా కుంగిపోవడం వల్లే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాని తెలుస్తోంది. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హీరో ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడంపై సినీ ప్రముఖులంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. సుశాంత్ మృతిపై టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దు:ఖంలో బాలీవుడ్..
సుశాంత్ సింగ్ మరణ వార్తతో బాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగింది. ఆయన మృతిపై బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ దత్,అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇలా ప్రతీఒక్కరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవాడు..
రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అద్భుతమైన నటుడు. ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవాడు. చాలా తొందరగా వెళ్లిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి దేవుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశాడు.

త్వరగా వెళ్లిపోయాడు..
సుశాంత్ మృతిపై ఎన్టీఆర్ స్పందించాడు. ఈ మేరక సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘సుశాంత్ సింగ్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. అద్భుతమైన ప్రతిభావంతుడు చాలా తొందరగా మనల్ని వదిలి వెళ్లిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్వీట్ చేశాడు.

హృదయం బద్దలైంది..
సుశాంత్ సింగ్ మరణ వార్త తెలుసుకున్న నాని సోషల్ మీడియాలో వేదికగా స్పందించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ హృదయం బద్దలైందన్నట్టు ఓ ఎమోజీని షేర్ చేశాడు. ఎంతో గొప్ప నటుడు.. ఎన్నో మంచి చిత్రాల్లో పాజిటివ్ పాత్రలను చేశారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తమన్ కోరుకున్నాడు.
Recommended Video

తీవ్ర వేదన..
సుశాంత్ మరణ వార్తపై వెంకటేష్ స్పందిస్తూ.. ‘సుశాంత్ మరణ వార్త ఎంతో కలిచి వేసింది. ఇండస్ట్రీ అంత గొప్ప నటుడిని త్వరగా కోల్పోయింది.. ఆయన కుటుంబానికి, అభిమానులకు బలం చేకూరాలి. ఆత్మకు శాంతి చేకూరాల'ని కోరుకున్నాడు.


Click it and Unblock the Notifications











