ఇంట్రెస్టింగ్: బాలీవుడ్ బడా హీరో సినిమా ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌లుగా రామ్ చరణ్, రానా

By Manoj

భారతదేశం మొత్తంలో పేరుమోసిన హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కొంత ప్రత్యేకమనే చెబుతారు. దీనికి కారణం ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగే అన్నది అందరికీ తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ సీనియర్ హీరోకు మగ అభిమానులతో పాటు లేడీ ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నారు. అందుకే ఈ బడా హీరో సినిమాలకు ఎప్పుడూ అంతే స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అందుకే ఆయన ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోతూ వస్తోంది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న స్టార్‌కు తెలుగు హీరోలు సాయం చేస్తున్నారట. పూర్తి వివరాల్లోకి వెళితే...

అక్కడే కాదు.. ఇక్కడ కూడా క్రేజ్

అక్కడే కాదు.. ఇక్కడ కూడా క్రేజ్

సల్మాన్ ఖాన్‌కు ఉత్తరాదిలో భారీ ఫ్యాన్స్ ఉన్నారని అంతా అంటుంటారు. అయితే, ఆయనకు దక్షిణాదిలో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ముఖ్యంగా తెలుగు వాళ్లకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెబుతుంటారు. ఆయనకు హైదరాబాద్ నేపథ్యం కలిగి ఉండడమే దీనికి కారణం. అందుకే ఆయన ప్రతి సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంటుందిక్కడ.

 ఇక్కడి డైరెక్టర్‌ను నమ్ముకున్నాడు

ఇక్కడి డైరెక్టర్‌ను నమ్ముకున్నాడు

సల్మాన్ తన గత చిత్రం ‘భారత్' అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఈ సారి భారీ స్థాయిలో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ‘వాంటెడ్'తో భారీ విజయాన్ని అందించిన ప్రభుదేవాతో మరోసారి జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘దబాంగ్ 3' తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తోంది. గతంలో వచ్చిన ‘దబాంగ్ 2'కు ఇది సీక్వెల్‌గా వస్తోంది.

 తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్

తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్

సల్మాన్ కొత్త చిత్రం ‘దబాంగ్ 3'ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు వెర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సల్మాన్ సినిమా దక్షిణాదిలో విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 చిరంజీవిని వాడుతున్నారు

చిరంజీవిని వాడుతున్నారు

ఈ సినిమా తెలుగులోనూ విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు ప్రభుదేవా సరికొత్త ప్లాన్స్ వేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో ఓ పాటకు సల్మాన్ ఖాన్.. ‘ఇంద్ర'లో చిరంజీవి వేసిన వీణ స్టెప్‌ను వాడుకోబోతున్నాడని అన్నారు. తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టెప్‌ను వాడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
చీఫ్ గెస్ట్‌లుగా రామ్ చరణ్, రానా

చీఫ్ గెస్ట్‌లుగా రామ్ చరణ్, రానా

ఇక, ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్‌ను వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోనూ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారని, దీనికి యంగ్ హీరోలు రామ్ చరణ్, రానా ముఖ్య అతిథులుగా వస్తున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. సల్మాన్‌తో ఉన్న స్నేహం కారణంగా చరణ్, తెలుగు హక్కులు తీసుకున్న సంస్థకు చెందిన హీరోగా రానా దీనికి వస్తున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X