Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
సల్మాన్ ఖాన్ సినిమాలో మెగా హీరో సర్‌ప్రైజ్.. షూటింగ్ కూడా ఫినిష్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే దాదాపు టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్నిటికీ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మన హీరోలు భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మిగతా భాషల్లో దర్శకనిర్మాతలు కూడా టాలీవుడ్ అగ్ర హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం దర్శకనిర్మాతలు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినీ ప్రముఖులు కూడా మన హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. మలయాళం లూసిఫర్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలు ఒక మెగా హీరో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అని కథనాలు వెలువడుతున్నాయి.

సల్మాన్ ఖాన్ సినిమాలు సినిమాలో రామ్ చరణ్ ఒక పాటలో హైలెట్ కాబోతున్నట్లు సమాచారం. ఫర్హాడ్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ చేయబోతున్న సినిమాలో వెంకటేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ ను ఇటీవల హైదరాబాద్ లోనే ఒక ప్రత్యేకమైన స్టేజ్ లో షూట్ చేసినట్లు సమాచారం. ఇక ఆ షూట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.

రామ్ చరణ్ కు అలాగే సల్మాన్ ఖాన్ ఇద్దరికి కూడా మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరు ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ ద్వారా పెరిగిన బాండింగ్ ద్వారా సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాలో స్టార్ హీరోకు స్పెషల్ సాంగ్ లో స్పెస్ తీసుకు రావడం విశేషం. ఇక ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సినిమాకు భాయీజాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.