జింకల కోసం గ్యాంగ్‌స్టర్‌గా.. సల్మాన్ ఫ్రెండ్ మర్డర్ వెనుక అసలు కథ అదే.. సీక్రెట్ విప్పిన వర్మ!

ముంబై మహానగరం నడిబొడ్డున మళ్లీ తుపాల తూటాల శబ్దం ప్రజలను కలవరానికి గురి చేసింది. అయితే ఎవరో సాధారణ వ్యక్తినో లేదా వ్యాపారవేత్తనో కాకుండా ఏకంగా ఎమ్మెల్యే, సల్మాన్ ప్రాణ స్నేహితుడు బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపి నేలకూల్చడం సంచలనం రేపింది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ముంబై నగరం ఉలిక్కి పడేలా చేసింది. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని హత్య చేసింది ఎవరు? ఆ హత్య వెనుక కారణం ఏమిటి? ఆ గ్యాంగ్‌స్టర్ నేర, వ్యక్తిగత జీవిత చరిత్ర ఏమిటంటే అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పిన విషయాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా సినీ తారలకు, రాజకీయ నేతలకు బెదిరింపు కాల్స్ వస్తుండటంపై నగర పోలీసులు మళ్లీ రంగంలొకి దిగారు. అయితే కొన్నాళ్లుగా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపి వేస్తామని రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ బెదిరింపులకు పాల్పడటం తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఆయన సన్నిహితుడు బాబా సిద్దిఖీని కాల్చి చంపడం ముంబైని వణికించేలా చేసింది.

Ram Gopal Varma interesting facts Lawrence Bishnoi after Salman Khan s Friend Baba Siddique

తన కార్యాలయం వద్ద పండుగను జరుపుకొనేందుకు శనివారం రాత్రం 9 గంటల ప్రాంతంలో బాబా సిద్దిఖి వచ్చారు. టపాసులు కాల్చుతుండగా ముగ్గురు అగంతకులు ఆటోలో నుంచి దిగారు. తమ ముఖాలకు కర్చీఫ్ కట్టుకొన్న వారు సిద్దిఖీ నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నేరుగా బాబా సిద్దిఖీ చాతిలో దిగింది. హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగానే ఆయన మరణించారు అని లీలావతీ హాస్పిటల్ వర్గాలు తెలిపారు.

ముంబైలో సంచలనం రేపిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిలో హర్యానాకు చెందిన గుర్మాయిల్ బల్జిత్ సింగ్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, శివ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను విచారించేందుకు ఏడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.

బాబా సిద్దిఖీ హత్య వెనుక హస్తం ఉందని భావిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ వర్గం సంచలన ప్రకటన చేశారు. బాబా సిద్దిఖీ హత్య చేయడానికి ప్రధాన కారణం టెర్రిరిస్టు దావూద్ ఇబ్రహీం తో సంబంధాలు, అలాగే సల్మాన్ ఖాన్‌తో సంబంధాలు. అంతేకాకుండా సల్మాన్ ఇంటిపై దాడి చేసిన అనుజ్ థాపన్ ఎన్‌కౌంటర్‌‌కు ప్రతీకారంగా ఈ హత్య చేశామని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

Ram Gopal Varma interesting facts Lawrence Bishnoi after Salman Khan s Friend Baba Siddique

అయితే బాబా సిద్దిఖీ హత్యకు దారి తీసిన పరిస్థితుల వెనుక సల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్‌కి ఉన్న పగనే కారణమని వర్మ తెలిపారు. రాజస్థాన్‌లో తాము గొప్పగా పూజించే కృష్ణ జింకలను సల్మాన్ బ్యాచ్ వేటాడటంపై ఆగ్రహం చెందిన లాయర్‌గా పనిచేసే బిష్ణోయ్.. గ్యాంగ్‌స్టర్‌గా మారారు. ఓ గ్రూపును తయారు చేసి సల్మాన్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారు.

బాబా సిద్దికి హత్య తర్వాత రాగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. కృష్ణ జింకలను వేటాడిన సూపర్ స్టార్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ లాయర్ తన వృత్తిని మానేసి గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తాడు. సల్మాన్‌ స్నేహితుడిని చంపడానికి ఫేస్ బుక్ ద్వారా దాదాపు 700 మందితో టీమ్ ఏర్పాటు చేసి అతడిని చంపాడు. అతడిని పట్టుకోవడం పోలీసులకు ఛాలెంజే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కథను సినిమాగా తెరకెకిస్తే హిట్టే అంటూ తన కామెంట్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X