తనుశ్రీ దత్తాను కెలికిన వర్మ.. బ్యూటీ ఎలా స్పందిస్తుందో..
బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై హీరోయిన్ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. నానా పాటేకర్‌కు అండగా నిలుస్తూ తనుశ్రీ దత్తాకు ఉచిత సలహా ఇచ్చాడు. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే చిత్రం సమయంలో తనను లైంగిక వేధించాడు. తాకరాని చోట తాకి ఇబ్బందికి గురిచేశాడు అని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది.
తనుశ్రీ దత్తా వివాదంలో రాంగోపాల్ వర్మ జోక్యం చేసుకుంటూ.., నానా పాటేకర్‌పై చేసిన ఆరోపణలను మరోసారి సరి చూసుకోవాలని సూచించాడు. ఈ మేరకు వర్మ ఓ వీడియోను షేర్ చేశాడు.

తనశ్రీ దత్తాకు మద్దతుగానో లేదా నానా పాటేకర్‌కు మద్దతుగానో చెప్పడం లేదు. నానాకు టెంపర్, తల పొగరు ఎక్కువే అని నాకు తెలుసు. అయితే ఎవర్నీ ఆయన నొప్పించే రకం కాదు అని వర్మ పేర్కొన్నారు.
ముఖ్యంగా తనుశ్రీ దత్తాకు నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే.. నానా పాటేకర్‌పై చేసిన ఆరోపణలను మరోసారి సరిచూసుకోవాలి అని వీడియో సందేశంలో వర్మ చెప్పాడు.


Click it and Unblock the Notifications











