పాయల్ లైంగిక ఆరోపణలకు RGV కౌంటర్.. ఆ దర్శకుడికి మద్దతుగా..
మొన్నటి వరకు సుశాంత్ డ్రగ్స్ కేసు ఆ తరువాత కంగనా రనౌత్ వివాధాలు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలతో సరికొత్త కాంట్రవర్సీలు క్రియేట్ అవుతున్నాయి. ఇంతకుముందు. మీటూ ఆరోపణలు చేస్తే చాలా వరకు ఇతర సెలబ్రెటీలు ఆ వివాదం జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఆ లిస్ట్ లో రామ్ గోపాల్ వర్మ కూడా చేరాడు.

అనురాగ్ కశ్యప్ కి సపోర్ట్..
పాయల్ ఘోష్ ఇటీవల డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఒక రూమ్ కి పిలిచి అసభ్యంగా బ్లూ ఫిలిమ్స్ చూపిస్తూ తన పై కూడా లైంగిక దాడులు చేయడానికి ప్రయత్న చేశాడని ఆమె ఆరోపించింది. దీంతో పాయల్ కి కంగనా వంటి వారు మద్దతు ఇచ్చారు. మరోవైపు అనురాగ్ కశ్యప్ కి కూడా సపోర్ట్ లభిస్తోంది.

మద్దతు పలికిన రామ్ గోపాల్ వర్మ
అయితే మొదటిసారి ఈ వివాదంలోకి విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ వివాదలపై ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ తనదైన శైలిలో మద్దతు కూడా ఇస్తున్నాడు. ఇక అనురాగ్ కశ్యప్ పై వచ్చిన ఆరోపణలపై కూడా ఆయన స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా పాయల్ కి కౌంటర్ ఇచ్చారనే కామెంట్స్ వస్తున్నాయి.

అనురాగ్ కశ్యప్ సున్నితమైన వ్యక్తి..
రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. నాకు తెలిసిన అనురాగ్ కశ్యప్ చాలా సున్నితమైన వ్యక్తి. అలాగే చాలా భావోద్వేగమైన వ్యక్తి కూడా. అతను నాకు గత 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఇన్నేళ్లలో అతను ఎవరినీ బాధపెట్టినట్లు చూడలేదు, వినలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న విషయాల్లో తనకు ఏ మాత్రం స్పష్టత లేదని వర్మ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
Recommended Video

సత్య సినిమాకు వర్క్ చేసిన అనురాగ్ కశ్యప్
అనురాగ్ కశ్యప్ పలు సినిమాలకు రైటర్ గా కూడా వర్క్ చేశాడు. RGV సత్య సినిమాకు కూడా రైటర్ గా వర్క్ చేసి అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి అనురాగ్, వర్మ బాలీవుడ్ లో బిజీ టెక్నీషియన్స్ గా మరారు. ఇక అనురాగ్ కశ్యప్ కి పలువురు స్టార్ హీరోయిన్స్ కి కూడా మద్దతు పలుకుతుండడంతో ఈ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











