twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోలంతా నా దృష్టిలో హీరోయిన్లు.. ఆమె నా మతిపోగొట్టేసింది.. రాంగోపాల్ వర్మ!

    |

    కంగన రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విమర్శకుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కంగనా రనౌత్ నటనకు.. పోరాట సన్నివేశాల్లో ఆమె పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక వివాదాస్పద దర్శకుడురాంగోపాల్ వర్మ కూడా కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రంపై తనదైన శైలిలో కామెంట్ చేశాడు.

    మతి పోగొట్టేసింది

    మతి పోగొట్టేసింది

    కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రాన్ని తాను చూశానని వర్మ సోషల్ మీడియాలో తెలిపారు. కంగనా రనౌత్ తన పెర్ఫామెన్స్ తో నా మతి పోగొట్టేసింది. ఇంటెన్సిటీతో, ఉగ్రరూపంతో కంగనా రనౌత్ చెలరేగిపోయింది రాంగోపాల్ వర్మ తెలిపాడు. ఇలాంటి నటనని, పెర్ఫామెన్స్ ని తాను గతంలో బ్రూస్లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో మాత్రమే చూశానని వర్మ తెలిపాడు.

    ఆ హీరోలంతా ఇక హీరోయిన్లు

    ఆ హీరోలంతా ఇక హీరోయిన్లు

    ఇప్పటి వరకు చాలా మంది యక్షన్ హీరోలని చూశాను. మణికర్ణిక చూసిన తర్వాత వాళ్లంతా నా దృష్టిలో హీరోయిన్లుగా మారిపోయారు. ఈ చిత్రంతో కంగనా రనౌత్ గ్రేటెస్ట్ హీరోగా మారిపోయింది అని వర్మ తెలిపాడు. దర్శకుడు క్రిష్ కొంత భాగం వరకు ఈ చిత్రానికి దర్శత్వం వహించాడు. క్రిష్ తప్పుకున్న తర్వాత కంగనానే దర్శకత్వ భాద్యతలు కొనసాగించింది. లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ చెలరేగి నటించినట్లు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.

     వెనకడుగు వేయకుండా

    వెనకడుగు వేయకుండా

    కంగనా రనౌత్ ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా పలు సందర్భాల్లో గాయాలకు గురైంది. అయినా కూడా వెనకడుగు వేయలేదు. ముందుగా అనుకున్న విధంగానే కష్టమైనప్పటికీ రిస్క్ తో కూడుకున్న యాక్షన్ సీన్స్ లో నటించింది. సినిమా పట్ల కంగనా ఈ విధంగా తన కమిట్మెంట్ ని చాటుకుంది. ఝాన్సీ రాణి లక్ష్మిబాయి అపర పరాక్రమాలకు, ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. వారియర్ క్వీన్ పాత్రలో కంగన నటన ఝాన్సీ లక్ష్మిబాయిని మురిపించే విధంగా ఉందంటూ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.

    <strong>అక్కడ గట్టిగా గిల్లి.. అదోలా నవ్వాడు.. ఆపై ఏం పీకుతావన్నట్టు చూశాడు? కంగన</strong>అక్కడ గట్టిగా గిల్లి.. అదోలా నవ్వాడు.. ఆపై ఏం పీకుతావన్నట్టు చూశాడు? కంగన

    విజయేంద్ర ప్రసాద్

    విజయేంద్ర ప్రసాద్

    బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ తనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని ఎంచుకుంటోంది. గతంలో కంగనా నటించిన క్వీన్ చిత్రానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    English summary
    Ram Gopal Varma on Kangana Ranaut in Manikarnika: All action heroes look like heroines in comparison
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X